Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: వెర్రి వెయ్యి రకాలు.. అందులో ఇదొకటి.. కారు దిగి ఎర్రటి ఎండలో పరుగులు!

Viral video: వెర్రి వేయి రకాలు అంటారు. అందులో ఇదొకటి అనిపించేలా చేసిందో జంట. అయితే ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్

By Vinod Kumar

Published on: May 6, 2022 12:59 PM

Updated on: May 6, 2022 12:59 PM

---Advertisement---

Viral video: వెర్రి వేయి రకాలు అంటారు. అందులో ఇదొకటి అనిపించేలా చేసిందో జంట. అయితే ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో ఏదో కొత్త ప్రయోగం చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా పది మందికి చేరవేడయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ, సంగీత్… ఇలా పలు రకాల కార్యక్రమాలను గ్రాండ్ గా చేస్కుంటున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ షూట్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రకారం… పెళ్లి వేడుక ముగిసిన తర్వాత నూతన దంపతులు తమ గ్రామానికి కారులో వెళ్తున్నారు.

Newly married couple get out the car and running in the sun at ater noon

Advertisement

అయితే వారికి హఠాత్తుగా ఏమైందో.. మార్గ మధ్యంలో కారు దిగి ఎండలో పరిగెత్తడం ప్రారంభించారు. ఎర్రటి ఎండలో పెళ్లి దుస్తుల్లోనే పోటా పోటీగా పరిగెట్టారు. మరి ఇది వెడ్డింగ్ షూట్ కోసం చేశారా… సరదాగా చేశారా తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :