Viral video: బస్టాండులో బాలికను పెళ్లాడిన బాలుడు, వీడియో వైరల్!

Viral video: రోజురోజుకూ మనుషుల్లో విపరీత బుద్ధులు పుడుతున్నాయి. చిన్న పిల్లలను చదువుకొమ్మని బడికి పంపిస్తే.. బస్టాండులోనే పెళ్లి చేసేస్కున్నారు. తోటి స్నేహితులు చదువుకోవాల్సిన పుస్తకాలను చింపి వారిపై చల్లుతూ వారి పెళ్లికి, ప్రేమకు జైకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చూసిన వారంతా చోద్యం చూస్తూ.. ముక్కున వేలేస్కుంటున్నారు. అయతే అసలు ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడులోని చిదంబరానికి చెంది ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ గాంధీ విగ్రహం దగ్గరలో ఉన్న ఓ బస్టాండ్ దగ్గర కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాలుడు, బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు. పక్కనే ఉన్న పిల్లలంతా వారికి మద్దతు తెలుపుతూ… పూలు చల్లారు.

Advertisement

అయితే ఈ వీడియోపై అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే ఒకటి కడలూర్ లో వెలుగు చూసింది. ఓ 23 ఏళ్ల వ్యక్తి ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి జరిగి సంవత్సరం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్కేయండి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel