Vizag: యువకుడిని చూసి గట్టిగా అరిచిన శునకం… చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది?

Updated on: May 2, 2022

Vizag: ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఎన్నో తప్పుడు మార్గాలను ఎంచుకుని ఆ తప్పుడు మార్గంలో పయనిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ కట్టడి చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ డ్రగ్స్ వినియోగం మాత్రం విచ్చలవిడిగా సాగుతోంది.ఇప్పటికే డ్రగ్స్ కేసులో భాగంగా ఎంతో మంది నిందితులను అదుపులోకి తీసుకోగా మరికొందరు పోలీసుల కళ్లుగప్పి విక్రయిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ తీసుకెళ్తూ ఇద్దరు యువకులు పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

విశాఖపట్నంలో ఓ యువకుడు తన స్కూటీలో 150 గ్రాముల గంజాయిని తీసుకెళ్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బీచ్ రోడ్డులో ఇద్దరు యువకులు నిలబడి ఉండగా వారిని చూసి సిసర్ అనే నార్కోటిక్ శునకం గట్టిగా అరిచింది. ఇలా కుక్క అరవడంతో ఆ యువకులు భయంతో పరుగులు తీశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇలా పోలీసుల అదుపులో ఉన్న వారిని మొత్తం చెక్ చేయగా వారి వద్ద ఏమి దొరకలేదు.

అయితే పోలీసులు వారి ప్రయాణిస్తున్న స్కూటీని పరీక్షించగా అందులో 150 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఆ యువకుడు గంజాయి ఎక్కడినుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel