Naga Chaitanya: బాలకృష్ణకి అల్లుడయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న నాగచైతన్య… కారణం అదే..?

Naga Chaitanya: చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నాయి. అటువంటి కుటుంబాలలో నందమూరి కుటుంబం అక్కినేని కుటుంబం మెగా కుటుంబం ఒకటని చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేదని తరచూ ఇరు కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్లే వారిని సమాచారం. అయితే వారి వారసులైన బాలకృష్ణ, నాగార్జున మధ్య కూడా అంతే మంచి అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత విభేదాలు కాకపోతే బాలకృష్ణ నాగార్జున మధ్య ఉన్న సానిహిత్యం అలాగే కొనసాగుతోందని సమాచారం.

ఇలా బాలకృష్ణ నాగార్జున మధ్య ఉన్న అనుబంధం వల్ల బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు ఇచ్చి వివాహం జరిపించాలని సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు కుటుంబ సభ్యులు కూడా చర్చించుకొని ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి నాగార్జున నాగచైతన్యతో ప్రస్తావించగా తాను సమంతని ప్రేమిస్తున్నట్లు నాగచైతన్య అప్పుడు బయటపెట్టాడట. తేజస్విని పెళ్లి చేసుకోమని నాగార్జున ఎంత సర్ది చెప్పినా కూడా నాగచైతన్య ససేమిరా అనడంతో నాగార్జున ఏమి చేయలేక చేతులెత్తేశాడు. సమంతతో పీకల్లోతులో ప్రేమలో ఉన్న నాగచైతన్య తేజస్విని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఈ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని వదిలేసినట్లు తెలుస్తోంది. ఇలా సమంతని ప్రేమించటం వల్ల నాగచైతన్య నందమూరి కుటుంబానికి అల్లుడు అయ్యే అవకాశం కోల్పోయాడు.

Advertisement

Naga Chaitanya:

ఆ తర్వాత బాలకృష్ణ తన చిన్న కుమార్తెను వైజాగ్ కి చెందిన శ్రీ భరత్ అనే వ్యక్తికి ఇచ్చి 2013 లో ఘనంగా వివాహాం జరిపించారు. ఇక నాగచైతన్య సమంత దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని ఆ తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో సమంతని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరికొకరు దూరంగా ఉండటం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు. ఒకవేళ నాగచైతన్య బాలకృష్ణకు అల్లుడు అయ్యుంటే తన కెరీర్ మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel