Crocodile Bark Trees : గాలినే కాదండోయ్.. నీరునిచ్చే చెట్ల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Crocodile Bark Trees : మనిషి బతకాలంటే కచ్చితంగా చెట్లు కావాల్సిందే. ఎందుకంటే మనకు ఆక్సిజన్ ని ఇచ్చే ఆ చెట్లు లేకపోతే మనం బతకలేం. అయితే వాటికి కూడా ప్రాణం ఉందని మన శాస్త్రవేత్తలు నిరూపించిన విషయం మనకు తెలిసిందే. అయితే మనకు చాలా చెట్లు తెలుసు. పండ్లు, ఆకులు, పూలను, ఆక్సిజన్ ను మాత్రమే ఇచ్చే చెట్ల గురించి అందరకీ తెలుసు. కానీ స్వచ్ఛమైన నీటిని ఇచ్చే చెట్ల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఆ చెట్లు ఏంటో వాటి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Crocodile Bark Trees
Crocodile Bark Trees

మొసలి బెరడు చెట్టు.. దీని సైంటిఫిక్ నేమ్ టెర్మినాలియా టొమెంటోసా. ఈ చెట్టు నుంచి మంచి నీరు ప్రవాహంలా వస్తుంది. దాహం వేసిన వాళ్లు దాహార్తిని కూడా తీర్చుకోవచ్చు. దీని సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ చెట్లు దక్షిణ భారత్‌లో అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి నీరు అంతగా లేని ప్రాంతంలో కనిపిస్తాయి. ఎండాకాలంలో తమకు కావాల్సిన నీటిని ఇవి తమ కాండాల్లో దాచుకుంటాయి.

అందువల్ల అడవుల్లో ఎవరికైనా దాహం వేస్తే ఈ చెట్టు కాండాన్ని కొద్దిగా తొలగిస్తే చాలు కుళాయి నుంచి నీరు వచ్చినట్లుగా బయటకు నీరు తన్నుకుంటూ వస్తుంది. ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. సహజంగా అడవుల్లో తిరిగే ఫారెస్ట్ ఆఫీసర్లు, పల్లె ప్రజలు దాహం వేసినప్పుడు ఈ చెట్ల నుంచి నీటిని తాగుతారు. దీని బెరడు… మొసలి చర్మం రంగులో, ఆకారంలో ఉండటం వల్ల దీన్ని మొసలి బెరడు చెట్టు అని పిలుస్తున్నారు.

Advertisement

Read Also : Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel