Karthika Deepam Aug 27 Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య దంపతులు హిమ కలిసి సౌర్య దగ్గరికి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య , ఆనందరావు పై కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ రావు ఇంటికి రమ్మని పిలవడంతో నేను రాను అని అంటుంది శౌర్య. వారి మాటలు చాటుగా వింటున్న హిమ సౌందర్య ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అయినా మీరు నన్ను ఇక్కడ గాలికి వదిలేసి మీరు అమెరికాకు వెళ్లిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అనగా మేము అమెరికాకు వెళ్ళాము అని నీకు ఎవరు చెప్పారు అమ్మ అని ఆనందరావు అడగడంతో, అమెరికాకు వెళ్లిన తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చాను అని అంటుంది.

అ మాట విని సౌందర్య ఆశ్చర్య పోవడంతో హిమ సౌందర్య పై కోప్పడుతుంది. అందుకే ఆరోజు వెళ్లొద్దు నానమ్మ అంటే మీరు విన్నారా చూడు సౌర్య ఇంటికి వచ్చిందట అని అంటుంది. ఆ తర్వాత సౌందర్య వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. మరొకవైపు దీప ఆటోలో వెళుతూ జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
Karthika Deepam Aug 27 Today Episode : కోపంతో రగిలిపోతున్న దీప..
ఆ కార్ డ్రైవర్ ని తీసుకుని మోనిత డాక్టర్ బాబు దగ్గరికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే సౌందర్య వాళ్ళు అటుగా వెళుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావు దీప ని చూసి దీప కనిపించింది. అప్పుడు హిమ సంతోషించగా సౌందర్య మాత్రం అది మీ భ్రమ అని అంటుంది. తర్వాత వారి ముగ్గురు బాధపడి అక్కడ నుంచి మళ్లీ తిరిగి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత దీప వాళ్ళ డాక్టర్ అన్న దగ్గరికి వెళ్ళగా అతను దీప ను చెక్ అప్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జరిగిన విషయం అంతా అతనికి చెబుతుంది దీప. ఆ తర్వాత అతను దీప కు ధైర్యం చెబుతాడు. మరొకవైపు మోనిత పనిచేసుకుంటూ ఉండగా అప్పుడు ఒకచోట కూర్చున్న కార్తీక్ తన గతం మొత్తం గుర్తు చేసుకుంటాడు. అప్పుడు సడన్గా దీప అని పిలవడంతో మోనిత షాక్ అవుతుంది.
ఆ తర్వాత మోనితను పట్టుకొని నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ కీ మళ్ళీ గతం గుర్తుకు వస్తుంది అని భయపడిన మోనిత పని ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆనంద్ రావు, సౌందర్య, హిమా ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ సౌర్య గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప, డాక్టర్ బాబు ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత డాక్టర్ బాబుని ఫాలో అవుతూ నేరుగా మోనిత ఇంటికి వెళుతుంది. అక్కడ మోనితను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప. అప్పుడు మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది.
- Karthika Deepam Aug 6 Today Episode : నాకు మోనిత పోలికలే వచ్చాయి.. శోభ మాటలకు షాక్ అయిన నిరుపమ్..?
- Karthika Deepam November 9 Today Episode : మోనితను అడ్డంగా ఇరికించిన దుర్గ.. కార్తీక్ మాటలకు షాక్ అయిన మోనిత..?
- Karthika Deepam July 1 Today Episode : కార్తీక్, దీపలను తలచుకొని ఎమోషనల్ అవుతున్న సౌర్య,హిమ.. బాధలో సౌందర్య..?













