Karthika Deepam Aug 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప తన మనసులోని బాధలు అన్నీ డాక్టర్ బాబు వాళ్ళ అమ్మకు చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, మోనిత గురించి టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు దీపకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వాళ్ళ అమ్మ దీపకు ఏం కాదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ధైర్యం చెబుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ ఒక బట్టల షాప్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడు కస్టమర్స్ వచ్చి డబ్బులు ఎంత అంటే మరిచిపోయిన కార్తీక్ కొంచెం డబ్బులు తీసుకొని పంపిస్తాడు.
అప్పుడు అక్కడున్న ఎంప్లాయిస్ ఇంత మతిమరుపు ఉన్న అతన్ని మేడం ఎలా భరిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరొకవైపు కార్తీక్ కార్ డ్రైవర్ శివ రోడ్డుపై ఐస్క్రీం తింటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దీప వస్తుంది. ఇప్పుడు దీప ని చూసి శివ పారిపోతూ ఉండగా వెంటనే దీప పట్టుకుని కార్తీక్ గురించి ఆరా తీస్తూ ఉంటుంది.. మొన్న ఫోటో చూపిస్తే తెలియదు అన్నావు మరి నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అడగగా..
నన్నేమీ అడక్కండి మేడం నాకేమీ తెలియదు అని అంటాడు శివ. అప్పుడు చెప్తావా లేకపోతే పోలీసులకు పట్టి ఇవ్వాలా అని అనడంతో నిజం చెప్తాను మేడం అని అంటుండగా ఇంతలోనే అక్కడికి మోనిత వచ్చి దీప నీ కిందకు తోసేసి ఆ శివ కారులోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ కి మోనిత గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నీ పేరేంటి అసలు నేను నిజంగానే నీ భర్త నా అంటూ రకరకాల డౌట్లు అడుగుతాడు.
Karthika Deepam Aug 26 Today Episode : మోనితను చూసి దీప అని పిలిచిన డాక్టర్ బాబు..
అప్పుడు మోనిత కార్తీక్ కీ గతం గుర్తు లేకపోవడంతో మాయమాటలు అని చెప్పి కార్తీక్ నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. నన్ను బయటకు ఎందుకు పంపించడం లేదు అని అనడంతో నా భయం నాది. నువ్వు బయటికి వెళ్తే మళ్లీ ఇంటికి తిరిగి రావడానికి బాగా దారి మర్చిపోయి ఎక్కడ నాకు దూరం అవుతావని నిన్ను బయటకు పంపించలేదు అంటూ దొంగ ప్రేమలు చూపిస్తుంది మోనిత.
మరొకవైపు ఆనంద్ రావు,సౌందర్య, హిమ ముగ్గురు కలిసి సౌర్య దగ్గరికి వెళ్తారు. హిమ సౌందర్య ఒక చాటున తక్కువగా ఆనందరావు మాత్రమే సౌర్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ సౌర్య అన్నం తినడం చూసి సౌందర్య అనంతరావు ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ ఎలా సౌర్య దగ్గరికి ఎందుకు వచ్చావు తాతయ్య వాళ్ళు కూడా వచ్చారా అంటూ ఆనంద్ రావు పై కోప్పడుతుంది.
మరి నీ కోపం ఎలా తగ్గుతుంది సౌర్య అని అనగా అమ్మానాన్న వస్తే తగ్గుతుంది తాతయ్య అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కార్తీక్, ఒకచోట కూర్చుని దీపా దీపా అని కలవరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మోనిత ను చూసి ఏంటి దీప అలా చూస్తున్నావు ఏం మాట్లాడవు ఏంటి అని అనటంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. డాక్టర్ బాబు మాటలను బట్టి చూస్తే గతం గుర్తుకు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also : Karthika Deepam Aug 25 Today Episode : మోనిత దగ్గర కార్తీక్.. నిజం తెలిసి షాక్ అయిన దీప..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World