Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?

Revanth Reddy : తాజాగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి బాగా జోరు పెంచారు. ఆయనతో పాటు బీజేపీ పార్టీ పగ్గాలు చేతబట్టుకున్న బండి సంజయ్ కూడా మాంచి జోష్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా 55 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుంది కావున వచ్చేసారి ఆ పార్టీని ప్రజలు కోరుకోకపోచ్చునని అంతా భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక ఆయన మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలనే తీసుకుంటే ఎంతో మందిని కాదని ఆయన యువకుడైన బల్మూరి వెంకట్ కు అవకాశం ఇచ్చారు. ఆ ఫలితం ఎలా వచ్చిందన్నది ఇక్కడ అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కువగా యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీనియర్లయిన జీవన్ రెడ్డి, జానా రెడ్డి, గీతా రెడ్డిలు వయసు మళ్లి చివరి దశకు వచ్చేశారు. ఇక కాంగ్రెస్ లో రాబోయే చాలా రోజుల పాటు వంశీచంద్ రెడ్డి లాంటి యువకులే ఉండనున్నారు.

ఇప్పటికిప్పుడు రాష్ర్టంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మరో వైపు బీజేపీ పార్టీలో మాత్రం బండి సంజయే సీఎం అభ్యర్థా అంటే ఆ విషయాన్ని కమలనాథులు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బండికి తోడు రాజా సింగ్, రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి నేతలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈటల రాజేందర్ వారికి జతయ్యాడు.

Advertisement

Read Also : Jr NTR Nara Lokesh : లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు..! జూనియరే కావాలట..! 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel