Karthika Deepam: సౌర్యకు ఆపరేషన్.. టెన్షన్‌లో కార్తీక్.. దూరమవుతున్న సౌందర్య, ఆనందరావు!

Updated on: January 27, 2022

Karthika Deepam Today Episode Jan 27 : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హోటల్ లో కార్తీక్ టేబుల్స్ క్లీన్ చేస్తుండగా అదే హోటల్ కి వచ్చిన దీప అనుకోకుండా కార్తీక్ ని చూస్తుంది. అలా చూసిన దీప ఒక్కసారిగా ఏవండీ.. అని గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు.

మీరు ఒక డాక్టర్, మీరు నా భర్త అలాంటి మీరు.. చాలా గర్వంగా బ్రతకాలి కానీ ఇలాంటి పని చేయడం ఏమిటి అని చాలా బాధతో ఏడుస్తుంది. ఆ క్షణంలో కార్తీక్ కు ఎం చేయాలో అర్థం కాదు. కార్తీక్ ఆ పని చేయడం ఇష్టం లేని దీప.. కార్తీక్ ను అక్కడి నుంచి ఇంటికి పంపిస్తుంది. అలా కార్తీక్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో కార్తీక్ చేసే పని దీప చేస్తుంది.

ఆ తర్వాత ఆ హోటల్ ఓనర్ వచ్చి ఎవరమ్మా అతను అని అడగగా.. నా భర్త అని అని ఏడ్చుకుంటూ దీప చెబుతుంది. మరోవైపు రుద్రాణిని సౌందర్య కొట్టినందుకు గాను ఏ క్షణంలో ఏమవుతుందని భయపడుతున్న ఆనంద్ రావ్ ను.. ఆ ఆశ్రమంలో మరో బ్రాంచ్ కి వెళ్ళమని ఆశ్రమంలో ఉండే వాళ్ళు సలహా ఇస్తారు. దానికి సరే అన్నట్లు ఆనందరావ్ మాట్లాడుతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దీప జరిగిన దాని గురించి ఆలోచించు కుంటూ ఉంటుంది.

Advertisement

Karthika Deepam Today Episode Jan 27 : ఈరోజు ఎపిసోడ్‌లో జరిగేది ఇదే..

ఈలోపు కార్తీక్ దీప దగ్గరికి రాగా దీప కార్తీక్ తో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. కార్తీక్ మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా.. దీప ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత కార్తీక్ ‘నువ్వు మాట్లాడకపోతే నా మీద ఒట్టే’ అని అంటాడు. దాంతో దీప కోపం మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత ‘ నేను ఇంత కష్టపడుతుంది ఎందుకు మిమ్మల్ని హోటల్లో పని చేయించడానికా ‘ అని దీప ఏడ్చుకుంటూ బాధ పడుతుంది.

ఆ తర్వాత కార్తీక్ తన తల్లిదండ్రులను ఎంత బాధ పెడుతున్నాడో తలుచుకుని బాధ పడతాడు. తర్వాత దీప, అత్తమామలు నేను కూడా ఆశ్రమంలో చూశా అని చెబుతోంది. తరువాయి భాగంలో సౌర్య ఒక దగ్గర ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. దీనికై సౌర్య కు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కి కావలసిన డబ్బు కొరకు కార్తీక్ తన తల్లి సౌందర్య దగ్గరకు వెళ్తాడు.

Read Also : Guppedantha Manasu: కోపంతో రగిలిపోతున్న దేవయాని.. ఏకంగా వసును కాలితో తన్నుతూ!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel