Karthika Deepam: ఇంద్రుడు దంపతుల పై మండిపడిన సౌర్య..మోనితకు వార్నింగ్ ఇచ్చిన దీప..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కార్తిక్ ఇద్దరు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీప ఇద్దరూ కారులో సౌర్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ నువ్వేమో వీళ్ళ దగ్గర చూశాను అంటున్నావు నాకు శౌర్య వారణాసి దగ్గర కనిపించింది దీప ఎలా అయినా నీకోసమైనా నేను వెతుకుతాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు దీప ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు డాక్టర్ బాబు. నాకు ఇప్పుడు అనుమానం వస్తోంది శౌర్య హైదరాబాదులోనే ఉంది ఇక్కడ లేదు అనటంతో కార్తీక్ లేదు సౌర్య ఇక్కడే ఉంది అని అంటాడు.

Advertisement

ఇప్పుడు కార్తీక్ అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు దీప ఎమోషనల్ అవుతూ ఉండగా కార్తీక్ ఓదారుస్తాడు. మరొకవైపు ఇంద్రమ్మ సౌరకి దిష్టితీస్తూ ఉండగా అప్పుడు శౌర్య అవును బాబాయ్ మీకు ఇన్ని డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అని అనటంతో వారు ఒకరి మోఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా శౌర్య వాళ్ళ పై సీరియస్ అవుతుంది. మీరు మాట్లాడటం లేదు అంటే దొంగతనం చేశారు అని నేను అనుకుంటున్నాను అంతంతో లేదమ్మా అలా చేయలేదు అని అంటాడు ఇంద్రుడు.

మరి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి అని సౌర్య వాళ్ళ పై సీరియస్ అవ్వడంతో మొన్న వాటర్ బాటిల్ ఇచ్చిన అమ్మలాగే మరొక అమ్మ నీకు దానం చేసింది అప్పుగా ఇచ్చారు ఊరకనే కాదు అని అంటాడు ఇంద్రుడు. అప్పుడు సౌర్య అంతలో ఖర్చు పెట్టొచ్చు కదా బాబాయ్ అనడంతో ఏదో మా తృప్తి కోసం లే బంగారు అని అంటుంది ఇంద్రమ్మ. వెంటనే సౌర్య మీరే ఇంత సంతోష పడుతూ ఉంటే మా అమ్మ నాన్నలు ఇంకెంత సంతోషపడతారు ఈ అమ్మాయి అయినా ఈ సమయంలో తన అమ్మానాన్నలు పక్కన ఉండాలి.

అని కోరుకుంటుంది కానీ నేను ఏం పాపం చేశాను బాబాయ్ అంటూ సౌర్య తన తల్లిదండ్రులను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అది చూసి ఇంద్రమ్మ దంపతులు కూడా బాధపడుతూ ఉంటారు. మరొకవైపు దీప ఎమోషనల్ అవుతూ ఉండగా దుర్గా హోదా ఇస్తాడు. నా తలరాత ఇంతేనేమో దుర్గ నేను ఏది అనుకున్న సక్రమంగా జరగడం లేదు అని బాధపడుతూ ఉంటుంది దీప. అప్పుడు వాల్తేరు వాని గురించి మాట్లాడడంతో దుర్గ అసలు విషయం చెప్పడంతో దీప షాక్ అవుతుంది.

Advertisement

ఆ మోనిత ఇంత నిచానికి దిగజారుతుందా ఇప్పుడే దాని పని చెబుతాను అంటూ ఇంటి దగ్గరికి కోపంగా వెళుతుంది దీప. మరొకవైపు మోనిత కోపంగా కనిపించడంతో శివ ఈమె ఇప్పుడు ఏ మూడ్ ఉంటుందో తెలియదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు శివ ప్రేమతో మేడం తినండి మేడం అని అడగగా ఆకలిగా లేదని చెప్పాను కదా నన్ను విసిగించొద్దు అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతుంది. ఇంతలోనే దీప, కార్తీక్ ల గురించి మోనిత ఆలోచిస్తూ ఉండగా దీప అక్కడికి వచ్చి మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది.

ఎందుకు కొట్టావు అనడంతో వాల్తేరు వాణి విషయం గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అంటూ చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడు మౌనిత అవును నిన్ను చంపడానికి పంపించాను కానీ నువ్వు తప్పించుకున్నావు ఇకపై నిన్ను నేను వదలను అని అనగా కార్తీక్ డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నారు చెప్పవే ఇప్పుడే నీ అంతు తెలుస్తాను. అసలు విషయం చెబుతాను అని అంటుంది దీప. మీరు ఎక్కడికో వెళ్లారు అంటుంది మోనిత. అప్పుడు మోనిత దీప నిన్ను చంపేస్తాను నిన్ను బతకనివ్వను అని దీప గొంతు పిసకపోతు ఉండగా దీప గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత వారణాసి గురించి ఎంక్వయిరీ చేయడం కోసం కార్తీక్ ఇంద్రుడు ఇంటికి వెళ్ళగా ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు వచ్చారు సార్ అని అనడంతో వారణాసి ఫోటో సౌర్య ఫోటో చూపించి వీళ్ళని ఎక్కడైనా చూసావా అని అడగగా లేదు సార్ అనే అబద్ధం చెబుతాడు ఇంద్రుడు. అప్పుడు సౌర్య కార్తీక్ ని చూడడానికి బయటకు వస్తుండగా ఇంద్రమ్మ అడ్డుపడి లోపలికి పిలుచుకొని వెళ్లి కార్తీక్ ని చూడకుండా చేస్తుంది. ఆ తర్వాత వారణాసి అబద్ధాలు చెప్పి కార్తీక్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు లోపలికి రావడంతో ఎవరితో మాట్లాడుతున్నావ్ బాబాయ్ అని సౌర్య అడగగా నీకు హెల్ప్ చేసిన అతనితో మాట్లాడుతున్నాను అనడంతో ఒక మాట చెప్పి ఉంటే నేను కూడా థాంక్స్ చెప్పేదాన్ని కదా బాబాయ్ అని అంటుంది శౌర్య.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

నేను రమేష్ బాబు. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటాను.

Read More

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel