Jio New Feature : ఇక రీఛార్జ్‌ల బాధ తప్పినట్టే.. జియో యాప్‌లో నయా ఫీచర్..!

Updated on: January 8, 2022

Jio New Feature : చాలా తక్కువ టైంలోనే టెలికాం రంగంలో జియో ఓ విప్లవాన్ని సృష్టించింది. తన ప్లాన్స్, ఐడియాలతో అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తన యూజర్స్‌కు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడంలో ముందుంటుంది. ఇప్పటికే పలు రీఛార్జ్‌లపై 20 శాతం క్యాష్ బ్యాక్ పేరుతో యూజర్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో.

ఇక రీఛార్జి గడువు ముగుస్తుందనగానే మొబైల్‌కు మెసెజ్‌లు రావడం మొదలవుతాయి. రీఛార్జ్ చేయించుకోండి అని గుర్తుచేస్తూ నెట్ వర్క్ నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. దీంతో మనకు కాస్త చిరాకుగా, అసౌకర్యంగా అనిపించడం కామనే. వీటన్నింటి నుంచి యూజర్స్‌కు విముక్తి కలిగించేందుకు జియో ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని వల్ల ప్రతి సారి రీఛార్జి చేసుకునే పని తప్పనుంది. ఎన్‌పీసీఐ‌తో ఒప్పందం కుదుర్చుకున్న జియో.. ఈ కొత్త ఫీచ‌ర్‌ ను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్స్ అందరికీ ఇది వర్తించనుంది.

జియో యూజర్స్ కోసం ప్రత్యేకంగా మై జియో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో యూపీఐ ఆటో ప్లే ద్వారా ప్రతి నెలా ఆటోమెటిక్ రీఛార్జ్ చేసుకోవచ్చు. యూపీఐ ఆటో ప్లే కోసం ప్రతి సారీ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మై జియో యాప్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత మొబైల్‌ సెక్షన్‌ అనే ఆప్షన్ లోకి వెళ్లాలి.

Advertisement

రీఛార్జ్‌లు, పేమెంట్స్‌ కేటగిరిలోకి వెళ్లి జియో ఆటో పే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. తర్వాత గెట్‌ స్టార్టెడ్‌ అనే ఆప్షన్ ను ఎంచుకుని ప్లాన్ సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం యూపీఐ ఆప్షన్‌ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత యూపీఐ ఐడీని నమోదు చేసి వెరిఫై చేసుకోవాలి.

Read Also : WhatsApp Admin : ఈ సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు తిరుగు లేని అధికారం..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel