...

WhatsApp Admin : ఈ సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు తిరుగు లేని అధికారం..

WhatsApp Admin : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతీ ఒక్కరు యూజ్ చేస్తుంటారు. ఈ యాప్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందని చాలా మంది అంటుంటారు కూడా. కాగా, వాట్సాప్ తన యూజర్స్ కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకురాబోతున్నది. అయితే, ఈ ఫీచర్‌ను వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే..

వాట్సాప్ ఏటా తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అనేక కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నది. అది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కోసం ఉద్దేశించబడినది. జనరల్‌గా గ్రూప్ అడ్మిన్స్ తమ విలేజ్, రిలేటివ్స్, ఎంప్లాయిస్, సంఘం, మండలం, జిల్లా.. ఇలా కొందరు మెంబర్స్‌ను కలిపి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటారు. ఆ గ్రూపులో తమ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటుంటారు.

ఇలా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అందరికీ సమాచారం కూడా ఇస్తుంటారు. గ్రూపులో ఉన్న సభ్యులు ఆ విషయాలను తెలుసుకుంటుంటారు. కాగా, వాట్సాప్ గ్రూపులో ఉండే సభ్యుల వలన ఇతరులకు ఇబ్బందులు కలిగే సందర్భాలు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. చాలా సార్లు ఎవరో ఒక సభ్యుడు సెండ్ చేసే అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు గ్రూపు సభ్యులను డిస్ట్రబ్ చేస్తుంటాయి.

whatspp
whatspp

ఇకపోతే ఆ మెసేజ్‌ను ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే డిలీట్ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ ఆ సభ్యులు మెసేజ్ డిలీట్ చేయలేకపోతే అది అలానే ఉండిపోయి ఇతరలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. కాగా, ఇకపై ఆ సమస్య ఉండకుండా మెసేజ్ డిలీట్ చేసే అవకాశం గ్రూప్ అడ్మిన్స్‌కు వాట్సాప్ ఇస్తున్నది. గ్రూప్ అడ్మిన్ అభ్యంతరకర ఫొటో, వీడియో, మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు.

అలా వాట్సాప్‌లో వచ్చే ప్రతీ మెసేజ్, ఫొటో, వీడియో అన్నిటినీ ఆ గ్రూపులో ఉంచే డెసిషన్ గ్రూప్ అడ్మిన్ తీసుకోవచ్చు. ఈ న్యూ ఫీచర్ త్వరలో రాబోతున్నది. ప్రజెంట్ బీటా టెస్టర్స్ ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ 2.22.1.1 అప్ డేట్‌లో ఈ ఫీచర్ రాబోతున్నట్లు వబెటఇన్ఫో తెలిపింది. ఒకవేళ గ్రూప్ అడ్మిన్ ఏదేని అంశం డిలీట్ చేస్తే ‘దిస్ మెసేజ్ వాజ్ రిమూవ్ డ్ బై యాన్ అడ్మిన్’ అని మెసేజ్ వస్తుంది.

Read Also : Telegram New Features : టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్స్.. ఇక వాట్సాప్‌ వదిలేస్తారు..!