Jio Anniversary Offer : జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

Jio Anniversary Offer : రిలయన్స్ జియో వచ్చి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. జియో 6వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జియో యూజర్లకు ఆ సంస్థ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. తన ఆరో యానివర్సరీ సందర్భంగా జియో యూజర్లకు రూ. 10 లక్షల రివార్డ్స్ అందించనుంది. దాంతో పాటు రిఛార్జీ చేసుకున్న వారికీ ఆఫర్లు ఇస్తోంది. ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 బెనిఫిట్స్ ఇస్తోంది రిలయన్స్ జియో.

Reliance jio announced offer for its 6th anniversary
Reliance jio announced offer for its 6th anniversary

జియో యూజర్లు సెప్టెంబర్ 11 వరకు ఆఫర్లు పొందవచ్చని రిలయన్స్ ప్రకటించింది. అయితే జియో ప్రకటించిన ఈ తాజా ఆఫర్లు కొంత కాలం వరకే ఉంటాయి. అంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు అన్నమాట. ఆ తర్వాత ఈ ఆఫర్లు కావాలనుకున్నా.. అందుబాటులో ఉండవు. సెప్టెంబర్ 11 వరకే ఉన్న ఈ ఆఫర్లు.. సెప్టెంబరు 12 నుండి రీఛార్జీ చేసే వారికి జియో 6వ వార్షికోత్సవం ఆఫర్లు లభించవు.

రూ.2,999 తో సంవత్సర ప్లాన్ పై ఆరు బెనిఫిట్స్ పొందవచ్చు. సెప్టెంబర్ 11 లోపురూ.2,999 యాన్యువల్ ప్లాన్ రీఛార్జీ చేస్తే అదనంగా 75 జీబీ డేటా పొందవచ్చు. అలాగే ఇక్సిగో నుండి రూ. 750 విలువైన కూపన్ వస్తుంది. నెట్ మెడ్స్ నుండి రూ. 750 తగ్గింపు కూపన్ లభిస్తుంది. మరో మూడు డిస్కౌంట్ కూపన్స్ లభిస్తాయని రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ఆపర్లు కావాలనుకుంటె వెంటనే రిచార్జీ చేయండి.

Advertisement

Read Also : Pan card missing: పాన్ కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel