Viral Video: నడి రోడ్డు మీద ఒకరికొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!

Viral Video : ప్రస్థుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాటిని వీడియోలూ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే వారిని విడిపించకుండా తాపీగా ఫోన్ లో వీడియోలు తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Viral Video
Viral Video

సాధారణంగా కాలేజీ కుర్రాళ్లు ఇలా రోడ్ల మీద అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఇలా రోడ్డుమీద ఒకరితో ఒకరు గొడవ పడుతూ కొట్టుకుంటున్నారు. ఇటీవల చెన్నైలో ఇద్దరు యువతులు ఒక అబ్బాయిని ప్రేమించి అతని కోసం రోడ్డు మీద గొడవ పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇటువంటి సంఘటన బెంగళూర్ లో చోటు చేసుకుంది. బెంగుళూరు బిషాప్ కాట‌న్ గ‌ర్ల్స్ స్కూల్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు మరో ఇద్దరు అమ్మాయిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం విఠ‌ల్ మాల్యా రోడ్డులో ఒకరితో ఒకరు గొడవపడ్డారు.


అమ్మాయిలు నలుగురు ఒకరికొకరు జుట్టు పట్టుకొని లాక్కుంటూ బేస్ బాల్ బ్యాట్ తో కొట్టుకుంటున్నారు. వీరి గొడవ చూసిన స్థానికులు వారిని విడిపించటం పోయి వారి గొడవను వీడియో తీస్తూ చూస్తున్నారు. ఈ గొడవ కారణంగా కొందరు అమ్మాయిలు కూడా గాయపడ్డారు. అయితే వీరి గొడవకు కారణం ఇప్పటివరకూ తెలీదు. వీరి గొడవ గురించి ఇప్పటివరకు పోలిసులు కానీ, పాటశాల యాజమాన్యం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అమ్మాయిల గొడవకు సంబందించిన వీడియో వైరల్ అవటంతో అబ్బాయిలకు అమ్మాయిలు ఏ మాత్రం తీసిపోవటం లేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్ల పెడుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel