Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

PM KISAN : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 11 వ ఇన్స్టాల్ మెంట్ కు వారు మాత్రమే అర్హులు..?

PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు ... Read more

By Ramesh Babu

Published on: April 23, 2022 7:00 PM

Updated on: April 23, 2022 11:22 PM

---Advertisement---

PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు అందరికీ కాకుండా కేవలం కొంత మంది రైతులకు మాత్రమే జమ కానున్నట్లు వెల్లడించారు.

ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పదకొండవ విడతలో భాగంగా పీఎం కిసాన్ నిధి డబ్బులు జమకానున్నాయి. ఇక ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులకు డబ్బులు ఈ విడతలో జమకావు. అందుకే రైతులు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ కేవైసీ ప్రక్రియను మే 31 2022 లోగా పూర్తి చేయాలి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం కోసం https://pmkisan.gov.in/ లో ఇ-కేవైసీ నిలిచిపోయింది. రైతులు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీ అప్‌డేట్ చేసే అవకాశం లేదు కాబట్టి రైతులు కామన్ సర్వీస్ సెంటర్‌లో 2022 మే 31 లోగా ఇ-కేవైసీ చేయించాలి.ఈ విధంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే 11 వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇలా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో ఈ విడత డబ్బులు రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ మే 31లోగా చేయించుకోవాలి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?