Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఆదిత్య ఎవరూ లేరు అని బాగా ఎమోషనల్ అవుతాడు. మరోవైపు మోనిత వెళ్లేదారిలో ప్రియమణి అడ్రస్ అడుగుతుండగా ఎవరు తెలియదు అని చెబుతారు. అదే దారిలో అటువైపు దీప వెనుక బాబు తో నడుచుకుంటూ వస్తుంది. కానీ మోనిత దీపను చూడకుండా తన ధ్యాసలో తాను ఉంటుంది.
మరో వైపు హోటల్ లో పని చేయడానికి సిద్ధమైన కార్తీక్ హోటల్ కి వెళ్తాడు. అక్కడ ఎంగిలి ప్లేట్లు తీయడానికి ముందు.. ఇంతకు ముందు ఎలాంటి లైఫ్ అనుభవించాడో.. ఇప్పుడు ఎలాంటి లైఫ్ లో ఉన్నానో ఆలోచించుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు. ఈ లోపు హోటల్ ఓనర్ ఏం చదువుకున్నావు అని అడగగా.. సమాధానం చెప్పలేక పోతాడు. ఆ తర్వాత ఆ హోటల్ యజమాని కార్తీక్ ను మీల్స్ పార్సిల్స్ ఆర్డర్స్ వచ్చాయి.. నువ్వు సైకిల్ మీద వెళ్లి ఇచ్చి రావాలి అని అంటాడు.
దానికి కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు దీప చీటీ పాట కట్టడడానికి వెళుతుంది. మొత్తానికి చీటీ పాట కట్టేస్తుంది. కానీ దీపకు తెలియదు తాను చీటీ పాట కట్టింది రుద్రాణి మనిషికి అని. ఆ తరువాత కార్తీక్ హోటల్లో భోజనం వడ్డిస్తూ ఉండగా ఆకలితో ఉన్న మోనిత హోటల్ కి వస్తుంది. వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది మోనిత. ఈలోపు కార్తీక్ లోపలికి వెళ్తాడు. అక్కడ మోనిత ఫుడ్ ఆర్డర్ చేయగా ఆ వాయిస్ ను కార్తీక్ గుర్తుపట్టి ఒక్కసారిగా మోనితను చూసి స్టన్ అవుతాడు.
మరి రేపటి భాగంలో అయినా మోనిత కార్తీక్ ను చూస్తుందో లేదో చూడాలి. వచ్చేనెల రుద్రాణి పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ పిల్లల మీద కన్నేసిన రుద్రాణి మొత్తానికి కార్తీక్ దగ్గర నుంచి పిల్లలను తీసుకోవడానికి ఫిక్స్ అయ్యింది. కనుక పిల్లలకు గౌనులు కుట్టడానికి ఓ టైలర్ కి కొలతలు ఇస్తుంది. ఆ ట్రైలర్ కి డౌట్ వచ్చి దీపకు వచ్చి జరిగిన సంగతి చెబుతుంది. అప్పుడు దీప మరింత బాధ పడుతుంది. ఇక హోటల్లో చేయరాని పని చేస్తున్నా కార్తీక్ అదే హోటల్ కి తినడానికి వచ్చిన మోనిత కంట కార్తీక్ పడతాడో లేదో చూడాలి. ఇక రేపటి భాగం లో దీప వంట చేస్తూ ఉండగా అక్కడకు రుద్రాణి వస్తుంది. మరి అక్కడికి వచ్చిన రుద్రాణి దీపకు ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.
- Karthika Deepam serial Sep 17 Today Episode : కొడుకుని తీసుకెళ్లిన మోనిత.. సరికొత్త ప్లాన్ వేసిన దీప..?
- Karthika Deepam serial Oct 28 Today Episode : మోనితకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్.. సంతోషంలో వంటలక్క..?
- Karthika Deepam March 8th Today Episode : ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ బాబు వంటలక్క.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?













