Devatha Aug 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ కోసం ఫ్రెండ్స్ వెతుకుతూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ కోసం ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. అయితే మాధవ పక్కన కట్టి లేకుండా స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా కాసేపు మాట్లాడుతాడు. ఆ తర్వాత మాధవ ఇంటికి వెళ్ళొస్తాను అని ఫ్రెండ్స్ తో చెప్పగా అప్పుడు ఫ్రెండ్స్ రాధ కోసం వెళుతున్నాడు అని అనడంతో మాధవ మురిసిపోతూ ఉంటాడు.

ఇంతలోనే మాధవ ఫ్రెండ్స్ లో ఒకతను పెళ్లయిన ఆంటీ తో లవ్ ఏంటి అంటూ వెటకారంగా మాట్లాడతాడు. వెంటనే మాధవ అతని చెంప పగలగొడతాడు. ఆ తర్వాత రాధా మీద తనకు ఉన్న అభిప్రాయం గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాధ, దేవి ఆదిత్య ఎలా అయినా కలవాలి అని దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే మాధవ రావడంతో కోపంగా చూస్తూ ఉంటుంది రాధ.
Devatha Aug 6 Today Episode : దేవుడమ్మ ఇంటికి వెళ్తున్నామన్నా మాధవ ..రాధ ఒక్కసారిగా షాక్..
అప్పుడు మాధవ రాధ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా రాధ చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడు మాధవ నేను రెండు రోజులు లేకపోయి సరికి నువ్వు ఏమేమి చేసావో నాకు అన్ని విషయాలు తెలుసు రాధ అంటూ రాధ చేసిన పనులు మొత్తం రాధకు చెబుతాడు. ఆ తర్వాత దేవికి కరాటే నేర్పించి మంచి పని చేశావు. దేవి ఏదో ఒక రోజు ఆదిత్యను కొడుతుంది అంటూ రాదను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు.

రాధ మాధవ పై అరుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవి వస్తుంది. అప్పుడు దేవితో నిన్ను ఒక చోటకి తీసుకొని వెళ్తాను మీ అమ్మను కూడా రమ్మని చెప్పు అనడంతో రాధ రాను అని అంటుంది. అప్పుడు దేవి బలవంతం చేయడంతో రాధ వెళ్లడానికి ఓకే అని అంటుంది. మరొకవైపు సూరిని వాళ్ళ అన్నయ్య ఊరికి ఎందుకు వెళ్లావు అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు సూరి వదినమ్మ బాధ చూడలేక రుక్మిణి వెతకడానికి వెళ్లాను అని అంటాడు.
అప్పుడు దేవుడమ్మ ఆ అమ్మాయి నిజంగానే మన రుక్మిణి లా ఉందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో సూరి అలాగే ఉంది వదినమ్మ అని చెబుతాడు. అప్పుడు దేవుడమ్మ ఆ ఊరికి ఎలా అయినా వెళ్లాలి అని అనడంతో వెంటనే సత్య ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆ ఊరి ప్రజలు మరొకలా అనుకుంటారు అని వద్దు అని అంటుంది. మరొకవైపు మాధవ రాధ,దేవిని తీసుకొని కార్లో వెళుతుంటాడు. ఇక దారిలో ఆఫీసర్ సారి ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము అనడంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు రాధ అక్కడికి ఎందుకు అంటూ మాధవని ప్రశ్నిస్తుంది.
Read Also : Devatha Aug 5 Today Episode : దేవి మాటలకు ఎమోషనల్ అయిన ఆదిత్య.. బయటపడిన మాధవ అసలు రూపం..?
- Devatha serial Sep 27 Today Episode : ఆదిత్యని తప్పుగా అర్థం చేసుకున్న సత్య..రాధకు అసలు విషయం చెప్పాలి అనుకుంటున్న జానకీ..?
- Devatha Serial Sept 12 Today Episode : మాధవకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన రాధ.. ఆలోచనలో పడ్డ చిన్మయి..?
- Devatha june 6 Today Episode : మూడో పెళ్లి గురించి రాధకు చెప్పిన ఆదిత్య.. బాధతో కుమిలిపోతున్న రాధ..?













