Devatha March 25th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్మయి పుట్టినరోజు సందర్భంగా మాధవ పిల్లలిద్దరికీ డ్రెస్సులు తీసుకొని వస్తాడు. దేవికి మగ పిల్లల డ్రెస్సు, చిన్మయికి పొడవాటి గౌను తీసుకొని రాగా పిల్లలు వాటిని వేసుకుని వస్తారు. వాళ్లను చూసిన మాధవ చిన్మయి నా కూతురులా ఉండాలి, దేవీ నా కొడుకులా ఉండాలి అని అనడం తో రాదా షాక్ అవుతుంది.
ఆ తరువాత రాధ అదే విషయం గురించి మాధవ తో మాట్లాడాలి అని వెళ్లగా, అప్పుడు మాధవ రాధా తనకు ఏం మాట్లాడటానికి వచ్చిందో ముందే గ్రహించి రాధా ఆడబిడ్డ అంటే ఎప్పుడో ఒకసారి అత్తారింటికి వెళ్లి పోవాల్సిందే కానీ మగ బిడ్డ అయితే మనతో ఉంటాడు. తలకొరివి పెట్టేది దేవినే అంటూ ఎమోషనల్ గా మాట్లాడేసరికి రాధా మౌనంగా ఉండి పోతుంది. మరొకవైపు ఆదిత్య గురించి దేవికి రాధ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా దేవి వినిపించుకోదు. మరోవైపు ఆదిత్య దేవి కోసం ఇంట్లో బొమ్మలు అన్నీ తెచ్చి పెట్టడంతో ఇంట్లో వారు ఏమి అర్థం కాక ఆదిత్య నిలదీస్తారు.

మరొకవైపు చిన్మయి,దేవి లు స్కూల్ కి వెళ్తారు. అప్పుడు దేవి అక్క ఈ రోజు నీ బర్త్ డే కదా ఏం కావాలో అడుగు అని అనగా అప్పుడు చిన్మయి ఏమడిగినా ఇస్తావా అని ప్రామిస్ చేయించుకుంటుంది. అప్పుడు ఏమిటి అక్క అని దేవి అడగగా.. అప్పుడు చిన్మయి నువ్వు ఎప్పటిలాగే ఆఫీసర్ సారు తో మాట్లాడాలి.
కోపంగా ఉండకూడదు అని అనడంతో దేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చిన్మయి కోరిక మేరకు దేవి చాక్లెట్ తీసుకొని వెళ్ళి ఆదిత్యకు ఇస్తుంది. మా అక్క లు మాట ఇచ్చిన అందుకే నేను నీతో మాట్లాడుతున్నాను అని అనడంతో అప్పుడు ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. నేను మీ అమ్మని అవమానించాను అనే కదమ్మా నీకు కోపం సరే పద అని నీ ముందే మీ అమ్మకు క్షమాపణలు చెబుతా అని ఆదిత్య దేవిని తీసుకుని రాధ దగ్గరకు వెళ్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha : ఆదిత్య ప్రవర్తనతో ఆందోళన చెందుతున్న సత్య… ఆదిత్య ఆశలకు అడ్డుకట్ట వేస్తున్న రుక్మిణి!
- Devatha serial Oct 12 Today Episode : మాధవ నిజ స్వరూపం తెలుసుకున్న భాగ్యమ్మ.. ఆదిత్య,రాధ లపై కోపంతో రగిలిపోతున్న సత్య..?
- Devatha serial September 10 Today Episode : ఆదిత్య,రాధ భార్య భర్తలు అని తెలుసుకున్న చిన్మయి..మాధవ నిజస్వరూపం తెలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాధ..?
- Devatha june 28 today episode : ఆదిత్య ప్రవర్తనకు బాధపడుతున్న సత్య..మాధవకు గట్టిగా సమాధానం చెప్పిన రాధ..?















