Devatha serial Sep 13 Today Episode : చిన్మయికి అసలు విషయం చెప్పేసిన రాధ.. ఆదిత్య, రుక్మిణి పెళ్లి ఫోటోని బయటపెట్టిన చిన్మయి..?

Devatha serial Sep 13 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో చిన్మయికి రాధ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో రాధ చిన్మయికి బాగా చదువుకో అవ్వని తాతలను కష్టపెట్టకు అని చెబుతూ ఉండగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నావమ్మా నన్ను విడిచి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అనడంతో వెంటనే రాధ రేపు దేవిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇక్కడికి రాను అని అనడంతో చిన్మయి షాక్ అవుతుంది. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు అమ్మ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నలు వేస్తూ ఉండగా రాధ సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

chinmay-gets-emotional-as-radha-reveals-the-truth-in-todays-devatha-serial-episode
chinmay-gets-emotional-as-radha-reveals-the-truth-in-todays-devatha-serial-episode

ఆ తర్వాత ఆదిత్య ఒంటరిగా దేవితో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే సత్య అక్కడికి వస్తుంది. అప్పుడు ఆదిత్య సత్యాన్ని పట్టించుకోకుండా తన ఊహల్లో తాను తేలుతూ ఉండగా అప్పుడు సత్య ఈ దేవి ఎవరు దేవి మీద ఎందుకు నువ్వు ఇంత ప్రేమ పెంచుకుంటున్నావు అనే ఆదిత్యను ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగా ఆదిత్య సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

మరొకవైపు జానకి, రాధా అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే చిన్మయి అక్కడికి రావడంతో నా దగ్గరికి వచ్చి పడుకో అని అనగా చిన్మయి అమ్మ లేకుండా నేను పడుకోను అని అంటుంది. అమ్మ లేకపోతే ఏం చేస్తావు అని అడగగా అమ్మ లేకపోతే నేను కూడా ఉండను అని అంటుంది చిన్మయి.

Devatha serial Sep 13 Today Episode : ఆదిత్య, రుక్మిణి పెళ్లి ఫోటోని బయటపెట్టిన చిన్మయి..?

దాంతో జానకి మరింత బాధపడుతూ రాధ ఏమో వెళ్ళిపోతాను అంటోంది చిన్మయి చూస్తే ఇలా అంటుంది అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాధ పిల్లలిద్దని పడుకోబెట్టి ఎమోషనల్ అవుతూ తాను కూడా అలాగే నిద్రపోతుంది. అప్పుడు సడన్గా చిన్మయి పైకి లేచి రాధవైపు అలాగే చూస్తూ ఉండగా ఏమైంది బిడ్డ అలా చూస్తున్నావు మంచినీళ్లు కావాలా అంటూ రాధా మంచినీళ్లు తేవడానికి వెళ్లగా వెనకాలే ఫాలో అవుతూ అక్కడికి వెళుతుంది చిన్మయి.

అప్పుడు ఏమైంది బిడ్డ అని అనగా నువ్వు ఇండ్లు వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావమ్మా అంటూ ఆదిత్య, రాధల పెళ్లి ఫోటోని చూపిస్తుంది చిన్మయి. ఆ ఫోటో ని చూసిన రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో అసలు విషయం చెప్పమ్మా అని అనగా రాధ నువ్వు నా బిడ్డవి కాదు మాధవ సార్ బిడ్డవి దేవి నా బిడ్డ. ఆదిత్య సారు నా పెనిమిటి అని చెప్పడంతో చిన్మయి షాక్ అవుతుంది.

Advertisement

అప్పుడు చిన్మయి వాళ్ళ అమ్మ ఆక్సిడెంట్ లో చనిపోయింది అంటూ రాధా జరిగింది మొత్తం వివరించడంతో వెంటనే చిన్మయి హత్తుకొని ఎమోషనల్ అవుతుంది. నువ్వు నన్ను విడిచి ఎక్కడికి వెళ్లదు అమ్మ నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు అని అనడంతో రాధ కూడా ఎమోషనల్ అవుతుంది.

Read Also :  Devatha Serial Sept 12 Today Episode : మాధవకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన రాధ.. ఆలోచనలో పడ్డ చిన్మయి..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel