Lip lock challenge: లిప్ లాక్ ఛాలెంజ్.. నడిరోడ్డు పైనే విద్యార్థుల ముద్దులు!

Lip lock challenge: ఐస్ బకెట్ ఛాలెంజ్.. రైస్ ఛాలెంజ్.. ఆ ఛాలెంజ్.. ఈ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఓ కళాశాల యువకులకు ఇవన్నీ బోర్ కొట్టాయో ఏమో. కొత్తగా లిప్ లాక్ ఛాలెంజ్ ను తీసుకొచ్చారు. పోటీపడుతూ మరీ ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ విద్యార్థులకు దిమ్మ తిరిగపోయే షాక్ ఇచ్చారు. అయితే ఆసలు ఈ లిప్ లాక్ ఛాలెంజ్ ఏంటి.. ఎవరు ఇలా రోడ్లపై ముద్దులు పెట్టుకున్నారనే విషయం తెలుసుకుందాం.

కర్ణాటక మంగళూరులోని ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు.. లిప్ లాక్ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు. నగరంలోపని ఓ రహదారిపై గుమిగూడి ఓ ఇంటి ముందు రభాస చేశారు. అబ్బాయి. అమ్మాయి పోటీపడి మరి ముద్దులు పెట్టుకున్నారు. చుట్టూ మూగున విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. దమ్ముంటే మీరు కూడా ఇలా చేయండంటూ తోటి విద్యార్థులకు సవాల్ విసిరారు. లిప్ లాక్ ఛాలెంజ్ పేరిట చేసిన ఈ రచ్చను ఓ వ్యక్తి వీడోయో తీసి నెట్టింట్లో పెట్టాడు. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ మారింది. ఇలా పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే వీరు లిప్ లాక్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నప్పుడు డ్రగ్స్ సేవించారా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel