Chandrababu : ఆయన విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కారణమేంటి?

Chandrababu : ఏపీ రాజకీయాల్లో వరసగా ఓటములు చవి చూస్తున్న టీడీపీ పార్టీ.. ఇంకా కోలుకోవడం లేదు. మరో వైపు టీడీపీ పుంజుకోకుండా వైసీపీ పార్టీ అనేక వ్యూహాలు సైతం రచిస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన సమయంలో మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో టీడీపీని అణచివేసేందుకు మండలిని రద్దు చేస్తామంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బిల్లు సైతం కేంద్రానికి పంపించారు. కానీ ఎందుకో తెలియదు కానీ దానిని కేంద్రం పక్కనపెట్టింది. ప్రస్తుతం మండలిలో వైసీపీ బలం పెరగడంతో మండలి రద్దుపై వైసీపీ వెనక్కి తగ్గింది.. మండలి రద్దు బిల్లును ఇటీవలే ఉపసంహరించుకుంది.

ఇలా టీడీపీని దెబ్బకొట్టేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తూనే ఉంది. వారి వ్యూహాలకు చిక్కకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు చేస్తుండగానే.. సొంత పార్టీకి చెందనే నేతలో ఆయనకు మేకులా తయారవుతున్నారు. దీంతో చంద్రబాబుకు మరో తలనొప్పి వచ్చిపడింది. టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంశీ ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబుపై.. అని కొడుకు లోకేశ్ పై అనేక వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్నాడు. మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనకు వంశీ చేసిన వ్యాఖ్యలే కారణం.

అయితే అతను టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయినా.. చంద్రబాబు అతని విషయంలో చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నాడనే విషయం తెలియడం లేదు. అసెంబ్లీలో వంశీ టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే.. వాటితో తమకేం సంబంధమంటూ వైసీపీ నేతలు గుసగుసలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే (వంశీ) వ్యాఖ్యల వల్లే పార్టీ, చంద్రబాబు ఇమెజ్ ప్రజల్లో తగ్గడానికి ఓ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.  మరి వంశీ విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంత మెతకగా వ్యవహరిస్తున్నారనేదే టీడీపీ పార్టీ నేతలకు సైతం అంతుపట్టడం లేదు.

Advertisement

Also Read : CM Etela Rajender : సీఎంగా ఈటల రాజేందర్.. అధ్యక్షా అంటూ…

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel