Lady Singham: కాబోయే భర్తను అరెస్టు చేసిన లేడీ సింగం.. తన పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!

Lady Singham: చట్టం ముందు అందరూ సమానమే అనే మాట మనందరికీ తెలిసిందే. అన్యాయం చేస్తే చట్టం ముందు మన తన అనే భేదం ఉండదు. మోసం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తుంటారు. ఈ క్రమంలోనే అస్సాంకి చెందిన ఒక మహిళా పోలీస్ ఎస్ ఐ తనకు కాబోయే భర్తను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కాబోయే భర్తను అరెస్టు చేయడానికి అసలు కారణం తెలియడంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ మహిళ ఎస్సై కాబోయే భర్తను అరెస్టు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

అసోంలోని నాగావ్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నటువంటి జున్మోని రభా అక్టోబర్ లో రాణా పొగాగ్ తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉంది. రాణా పొగాగ్  పబ్లిక్ ఆఫీసర్ గా ఎస్ఐకి పరిచయమయ్యారు. ఇలా మరికొన్ని నెలలో తనతో మూడుముళ్లు వేయించుకోవాలిన ఇన్స్పెక్టర్ తన చేతికి సంకెళ్లు వేసి బంధించారు.అయితే తాజాగా అతని గురించి ఆమెకు కొన్ని విషయాలు తెలియడంతో ఆశ్చర్యపోయిన ఆమె అలాంటి మోసగాడు బయట తిరగకూడదని తనని జైలుకు తరలించారు.

ఓ ఎన్జీవో పేరు చెబుతూ తన డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బు గుంజుతున్నాడు. ఇలా అందరితో డబ్బులు తీసుకొని కోట్లకు పడగలెత్తి నిరుద్యోగులను భారీఎత్తున మోసం చేస్తున్నారు. ఇక ఈ విషయం ఇన్స్పెక్టర్ జున్మోని రభా దృష్టికి రావడంతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా తనకు కాబోయే భర్తని తెలిసి వెంటనే తన చేతికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేశారు.ఇలా తనను అరెస్టు చేసిన ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి ముందే ఇతని గురించి తెలియడంతో నా జీవితం ఇబ్బందులు పడకుండా కాపాడుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు.ఇలా తన కాబోయే భర్త మోసగాడు అని తెలిసి తన చేతికి సంకెళ్లు వేశారని తెలియడంతో ఎంతోమంది ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel