Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Winter Fruits Health benefits : వింటర్‌లో ఇబ్బందులకు ఈ ఫ్రూట్స్‌తో చెక్ పెట్టండి..

Winter Fruits Health benefits : నేచర్ మనకు అన్నింటిని సమానంగా ఇస్తుంది. అందులో భాగంగానే కాలాలు సైతం.. అందులో వర్షాకాలం, వింటర్, సమ్మర్.. ఇలా మూడు ఉంటాయి. అన్ని

By Vinod Kumar

Published on: December 29, 2022 9:27 AM

Updated on: December 29, 2022 9:27 AM

winter-fruits-healthbenefits-in-telugu

---Advertisement---

Winter Fruits Health benefits : నేచర్ మనకు అన్నింటిని సమానంగా ఇస్తుంది. అందులో భాగంగానే కాలాలు సైతం.. అందులో వర్షాకాలం, వింటర్, సమ్మర్.. ఇలా మూడు ఉంటాయి. అన్ని కాలాలను అందరూ ఇష్టపడతారు. ఆయా సీజన్‌లలో చాలా రకాల ఫ్రూట్స్ మనకు లభిస్తుంటాయి. వాటిని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎంతో మేలు కలుగుతుంది. వింటర్ సీజిన్‌లో బాడీ టెంపరేచర్ తగ్గుతుంటుంది. చలి పెరగడంతో మన రెగ్యలర్ పని కూడా డిస్టర్బ్ అవుతుంది.

ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ గా లేడీస్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి చాలా పోషకాల అవసరమవుతాయి. వింటర్ లో చర్మం, జుట్టు, బోన్స్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. మెయిన్‌గా 40 ఏళ్లు పైబడిన లేడీస్‌లో కాళ్లు, వెన్ను వంటి నొప్పులు వస్తుంటాయి.

Advertisement
winter-fruits-healthbenefits-in-telugu
winter-fruits-healthbenefits-in-telugu

ఇలాంటి సమయంలో బాడీలో హీట్‌ను కాస్త పెంచుకుకోవడంతో పాటు పోషకాలను ఇచ్చేందుకు చాలా పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గంజి ఇది మంచి బ్రేక్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. బాడీకి వెంటనే శక్తిని ఇస్తుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యంల కూడా బాగుంటుంది. వింటర్‌లో విటమిన్ సి చాలా ముఖ్యం.

నారింజ, కివి, జామ, బొప్పాయి, నిమ్మ వంటి వాటిని రెగ్యులర్‌గా తినాలి. స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ, పొటాషియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇక ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వింటర్‌లో వీటిని తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వీటితో పాటు రాగులు, బాదం, అక్రోట్స్ వంటి డ్రై ఫ్రూట్ సైతం తీసుకుంటే బాడీకి కాల్షియం తదితర పోషకాలు అందుతాయి.

Read Also :  Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!

Advertisement

,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :