Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Shigella: కేరళలో మళ్లీ వెలుగు చూసిన షిగెల్లా.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Shigella: దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో ప్రజలలో కొత్త లక్షణాలు కనిపించినా కూడా అది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఏమో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో కేరళలో మళ్లీ షిగెల్లా వెలుగులోకి వచ్చింది. కోజికోడ్‌లోని పుత్తియప్పకు చెందిన ఏడేళ్ల బాలికలో షిగెల్ల లక్షణాలు ఉండటంతో వైద్యులు అనుమానం వచ్చి పరీక్ష చేయగా షిగెల్ల వ్యాధి నిర్ధారణ అయింది. ఆ చిన్నారితో పాటు తన ఇంటి ... Read more

By Ramesh Babu

Published on: April 29, 2022 2:42 PM

Updated on: April 29, 2022 2:42 PM

---Advertisement---

Shigella: దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో ప్రజలలో కొత్త లక్షణాలు కనిపించినా కూడా అది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఏమో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో కేరళలో మళ్లీ షిగెల్లా వెలుగులోకి వచ్చింది. కోజికోడ్‌లోని పుత్తియప్పకు చెందిన ఏడేళ్ల బాలికలో షిగెల్ల లక్షణాలు ఉండటంతో వైద్యులు అనుమానం వచ్చి పరీక్ష చేయగా షిగెల్ల వ్యాధి నిర్ధారణ అయింది. ఆ చిన్నారితో పాటు తన ఇంటి పక్కన నివసిస్తున్న మరొక చిన్నారిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ షిగెల్లా లక్షణాలు ఏమిటి ? ఇది ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ షిగెల్ల వ్యాది సోకినప్పుడు జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కొన్ని సందర్భాలలో కలుషిత ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీరు తాగడం వల్ల వాటిలో ఉండే క్రిముల కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వ్యాధి సోకినప్పుడు దీని ప్రభావం కారణంగా పిల్లలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ కాంటాక్ట్ లో ఉండటం వల్ల ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

ఈ షిగెల్ల వ్యాది సోకిన ఏడు రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ వ్యాధి సోకినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధి సోకిన వారు కొన్ని నియమాలు పాటించడం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కుని ఇతరులకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా శుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ.. తరచూ వేడి నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కడపడితే అక్కడ బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన చేయటం వల్ల ఇతరులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!