Omicron: ఒమిక్రాన్ వ్యాప్తిలో జంతువుల పాత్ర..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిపుణులు..!

Omicron: చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాపించి తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కరోనా వైరస్ ఒక్కో దశలో ఒక్కో విధంగా రూపాంతరం చెంది దశలవారీగా ప్రజల మీద దాడి చేసింది. కరోనా మొదటి వేవ్ లో ప్రాణ నష్టం అంతగా లేకపోయినప్పటికీ.. రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ విజృంభించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక మూడవ వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ అతి వేగంగా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెంది శ్వాస సంబంధిత సమస్యల కారణంగా కుప్పలు కుప్పలుగా ప్రజలు మరణించారు.

ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ సామాజిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ మాస్కులు ధరించి, తరచూ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవటం వంటి కరోనా నిబంధనలను పాటిస్తూ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ కరోనా మూడవ వేవ్ లో ఒమిక్రాన్ బీభత్సం సృష్టించింది. మిగిలిన వేరియంట్ లతో పోలిస్తే ఒమిక్రాన్ కారణంగా అధిక ప్రాణ నష్టం వాటిల్లింది. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు కొంచం తగ్గుముఖం పట్టాయి.

Advertisement

అయితే ఈ కరోనా వ్యాప్తి చెందటానికి రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా జంతువుల పాత్ర కూడా ఉందని అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. మనుషుల లాగే జంతువులలో కూడా కరోనా వైరస్‌ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అమెరికాకు చెందిన ప్రజారోగ్య నిపుణులు అమితా గుప్తా తెలిపారు. కరోనా మూడవ వేవ్ సమయంలో జంతువుల వల్ల కూడా వ్యాప్తి చెంది ఉండవచ్చునని ఆమె అభిప్రాయ పడ్డారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel