- ఆగస్టు 10లోపు ఇంటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు..
- ఇందిరమ్మ ఇళ్లు 2026.. మొబైల్‌తోనే దరఖాస్తు.. ఫుల్ ప్రాసెస్ ఇదే
- ఇందిరమ్మ ఇళ్లు దరఖాస్తు ఈజీ.. వాట్సాప్, మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్
Indiramma Houses 2026 : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా డిజిటల్‌గా మారింది. అర్హులైన ఫ్యామిలీలు ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్, మీ సేవ వెబ్‌సైట్, స్పెషల్ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఇంటి నుంచే అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్, అర్హతలు, హెల్ప్‌లైన్ నంబర్లు, లాస్ట్ డేట్ వంటి అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ (HUA)పరిధిలో దరఖాస్తుల సమర్పణకు 2026 ఆగస్టు 10 వరకు గడువు విధించింది.
ఇందిరమ్మ ఇళ్లకు ఇంటినుంచే అప్లికేషన్ :
అర్హులైన ప్రతి ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇళ్ల పథకం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త టెక్నాలజీని వాడుతోంది. అప్లికేషన్ ప్రాసెస్ మరింత ఈజీగా ఉండేలా ప్రజలకు తమ మొబైల్ ఫోన్ నుంచే రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే కాదు.. అర్హతలు, ఇల్లు నిర్మాణ వివరాలు, ప్రాంతీయ సమాచారం, సందేహాలకు సమాధానాలు వంటి అంశాలను అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు అందిస్తోంది.
గతంలో ప్రభుత్వ గృహ పథకాల కోసం పలు వెరిఫికేషన్ డాక్యుమెంట్లతో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవు. అర్హులు తమ మొబైల్ నుంచే అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ దగ్గర లేనివారి కోసం మీ సేవ కేంద్రాలు ఉన్నాయి.
కలెక్టరేట్లలో స్పెషల్ హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు. అప్లికేషన్ కోసం 8096958096 వాట్సాప్ నంబర్‌కు అవసరమైన వివరాలు పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే (meeseva.telangana.gov.in) వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ దశలవారీగా అధికారిక సోషల్ మీడియా పోస్టుల్లో వీడియోలను ప్రభుత్వం షేర్ చేస్తోంది.
Read Also : Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..
దరఖాస్తుదారుల సందేహాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. టోల్ ఫ్రీ నంబర్ 18005995991, సాధారణ సమాచారం కోసం 040-24603572కు కాల్ చేయవచ్చు. ఫోన్ కాల్స్‌తో పాటు సోషల్ మీడియా ద్వారా వచ్చే అన్ని ప్రశ్నలకు అధికారులు వీడియోల రూపంలో సమాధానాలు ఇస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, ఎలాంటి మిడియేటర్లకు డబ్బులు ఇవ్వొద్దని సూచిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల అర్హతలు, లాస్ట్ డేట్, హెల్ప్‌లైన్ వివరాలివే :
హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ (HUA) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసేందుకు 2026 ఆగస్టు 10 లాస్ట్ డేట్ వరకు మాత్రమే సమయం ఉంది. అర్హులైన వారు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా అప్లయ్ చేసుకోవాలి. అర్హతలను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రానికి దరఖాస్తుదారులు శాశ్వత నివాసితులుగా ఉండాలి. పక్కా సొంత ఇల్లు లేనివారై ఉండాలి. పేద లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారై ఉండాలి.
ఫ్యామిలీ మెంబర్ల పేరుతో ఇప్పటికే పక్కా ఇల్లు ఉండకూడదు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అలాగే ప్రజాపాలన సర్వే లేదంటే స్థానిక ఇందిరమ్మ కమిటీ ద్వారా అర్హులుగా గుర్తింపు పొందిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. అర్హులైన కుటుంబాలు నిర్ణీత గడువులోగా తమ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.













