Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?

Updated on: May 20, 2022

Crime News : ప్రస్తుత కాలంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలలో మాయలో పడి బంగారంలాంటి సంసారాలను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి సంబంధాల కారణంగా ఎంతో మంది వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ హంతకులుగా మారుతున్నారు. రోజుకి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

Crime News
Crime News

పూర్తి వివరాలతో వెళితే… హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్ లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇలా భర్తను మోసం చేస్తూ ప్రియుడితో ఉండటమే కాకుండా తన ప్రియుడే తన భర్త అని చెబుతూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అతనితో ఎంతో చనువుగా ఉండేది. అయితే తన భర్త సెలవుల నిమిత్తం ఇంటికి రాగా తన భార్య తన ప్రియుడితో చనువుగా ఉండటం చూసిన భర్త ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలా ఆ భర్త వారిద్దరినీ లోపల పెట్టీ బయట తాళం వేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా జవాన్ మాట్లాడుతూ తను తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని,మాకు ఇద్దరు పిల్లలని వెల్లడించాడు. ఇలా తనని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తను తనని దారుణంగా మోసం చేసిందని జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రోజు రోజుకు ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

Advertisement

Read Also :Crime News: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel