Crime News: మనిషి జీవితంలో మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు. ఎటువంటి కారణం లేకుండా కొన్ని సందర్భాల్లో నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక వైద్య విద్యార్థిని విషయంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. రాత్రి 11: 30 వరకూ విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళిన శ్వేతా అనే వైద్య విద్యార్థి ఉదయానికల్లా విగతజీవిగా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ శివారులోని తిమ్మాపూర్ ప్రాంతానికి చెందిన గుర్రం శ్రీనివాస్, కవిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు మెడిసిన్ పూర్తి చేయగా, కుమారుడు ఝార్ఖండ్ లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు.
శ్వేత నిజామాబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రసూతి విభాగంలో గురువారం రాత్రి 11:30 వరకు విధులు నిర్వహించి తర్వాత పక్కనే ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళింది. ఆమెతో పాటు కొందరు మహిళా హౌస్ సర్జరీలు కూడా ఆ గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అయితే వారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అక్కడినుండి వెళ్ళిపోగా.. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్వేతను నిద్రలేపడానికి అక్కడ ఉన్న సిబ్బంది ప్రయత్నించారు. కానీ శ్వేత అలా విగతజీవిగా పడి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే సుపరిటెండెంట్ కి సమచారం అందించారు.
అక్కడ వున్న సిబ్బంది, పోలిసులు, సుపరిటెండెంట్ గది వద్దకు వెళ్ళి పరీక్షించగా శ్వేత అప్పటికే మృతి చెందింది. అయితే ఈమె గతంలో రెండు సార్లు కోవిడ్ బారిన పడటం వల్ల గుండెపోటు వచ్చి మరణించి ఉండవచ్చునని సుపరిటెండెంట్ ప్రతిమ రాజ్ తెలియచేశారు. కూతురి మరణ వార్త గురించి తెలుసుకున్న శ్వేతా తల్లిదండ్రులు హుటాహుటిన కరీంనగర్ నుండి నిజామాబాద్ కి వచ్చారు. నిన్న సాయంత్రం వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న తమ కూతురు ఇలా హఠాత్తుగా ఎలా మరణించింది అంటూ శ్వేత తల్లిదండ్రులు నిలదీశారు.
చేతికొచ్చిన కూతురు అలా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవలే శ్వేతకు పెళ్లిచూపులు పూర్తయి నిశ్చితార్థం జరగవలసి ఉంది. జార్ఖండ్ లో ఐపిఎస్ శిక్షణ పొందుతున్న శ్వేత సోదరుడు వచ్చిన తర్వాత శవపరీక్ష నిర్వహించారు. శ్వేత తండ్రి గుర్రం శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World