Gold in scooty: స్కూటీలో 8 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా?

ఒక్కరోజే దాదాపు 19 కిలలోల అక్రమ బంగారం తరలింపును మణిపుర్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం విమానాశ్రయంలోని కొన్ని బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకు్నారు. మరికొన్నింటిని స్కూటీలో గుర్తించారు. అయితే వీటి విలువ దాదాపు 10 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. చన్ డేల్ జిల్లా తమ్నాపోప్కీలో సోమవారం మధ్యాహ్నం ఓ స్కూటీ ద్వారా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న ఈ బంగారానికి 8.3 కిలోలు ఉందని, దీని విలువ 4.44 కోట్లు ఉంటుందని వివరించారు.

తమకు అందిన సమాచారం మేరకు మోరేహ్ నుంచి వచ్చే ఎరుపు రంగు స్కూటీలో తనిఖీలు చేపట్టగా ఎయిర్ ఫిల్టర్లలో 50 బంగారు బిస్కెట్లు లభించాలని స్పష్టం చేశారు. నిందితుడు ఎయిర్ ఏసియా విమానంలో ఇంఫాల్ నుంచి దిల్లీ వెళ్లే క్రమంలో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. నిందితుడి వద్ద మొత్తం 10.79 కేజీల బరువున్న 65 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel