Crime News: మెదక్ జిల్లాలో దారుణం.. బైక్ కొనివ్వలేదని కన్న తల్లిని కడతేర్చిన తనయుడు..!

Crime News:ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబంగా పెంచటం వల్ల పెద్దయిన తర్వాత కూడా పిల్లల ప్రవర్తనలో మార్పు లేకుండా అలాగే మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఈ ప్రవర్తన వల్ల భవిష్యత్తులో పిల్లలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పిల్లల మీద ప్రేమతో వారు అడిగినవన్నీ కాదనకుండా ఇస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఆర్థిక సమస్యల వల్ల వారు అడిగినవి నెరవేర్చ లేనప్పుడు పిల్లలు మనస్థాపం చెంది దారుణానికి వడికడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… కొడుకు బైక్ కొనుక్కోవటానికి తల్లి చెవి దుద్దులు ఇవ్వడానికి నిరాకరించిందని కొడుకు ఆ తల్లిని గొంతునులిమి చంపేశాడు.నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి పోచమ్మ (76) అనే మహిళ కూలీ పనులు చేసుకునీ జీవిస్తున్నారు. పోచమ్మకు ఇద్దరు కుమారులు.చిన్న కుమారుడు కుమార్ ఏం పని పాట లేకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడు. ఇలా సంపాదన లేకుండా తల్లి సంపాదనతో తింటున్న కుమార్ సోమవారం రాత్రి తనకు ద్విచక్రవాహనం కావాలని అందుకు చెవి కమ్మలు ఇవ్వమని పోచమ్మతో గొడవ పెట్టుకున్నాడు.

కానీ పోచమ్మ చెవి దిద్దులు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుమార్ చెవి దిద్దులు ఇవ్వలేదనే కోపంతో పోచమ్మ ను గొంతు నులిమి చంపేశాడు. ఇది గమనించిన పోచమ్మ పెద్ద కుమారుడు నరసింహులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. నరసింహులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కుమార్ ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం పోచమ్మ మృతదేహాన్ని రామాయం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel