Crime News : అర్ధరాత్రి ఎక్సర్ సైజ్ చేయొద్దన్నందుకు… కన్న తల్లిని కడతేర్చిన కొడుకు !

Updated on: January 25, 2022

Crime News : కొడుకు మరి ఎక్కువగా కష్ట పడటం చూడలేక అర్థరాత్రి పూట వ్యాయమం చేయవద్దని చెప్పడమే ఆ తల్లి చేసిన పాపం అయ్యింది. అందుకు గాను కన్నతల్లినే ఓ కసాయి కొడుకు అత్యంత దారుణంగా చంపేశాడు. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో పాపమ్మ కుటుంబం నివాసముంటున్నారు. ఆమె కొడుకు సుధీర్ అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది.

దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతున్న అతని చెల్లి తల్లిని కాపాడేంధుకు అడ్డుగా రావడంతో ఆమెను కూడా రాడ్ తో కొట్టాడు. ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు త్వరితగతిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

Advertisement

అప్పటికే పాపమ్మ మృతి చెందగా, చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన పాపమ్మను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే, పలు గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా మారి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సుధీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also : Hang Over : హ్యాంగోవర్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా…

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel