RRR vs Radhe Shyam : రాధేశ్యామ్‌‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పోల్చుతున్న వారికి ఇదే సమాధానం..!

Updated on: March 24, 2022

RRR vs Radhe Shyam : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక సెంటిమెంట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

భారీ అంచనాల నడుమ తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ స్థాయిలో కాకున్నా కాస్త అటు ఇటు గా ప్రభాస్ సినిమా కూడా భారీ అంచనాలను మూట కట్టుకొని విడుదలైంది. కానీ ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. కనీసం 200 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది. బయ్యర్లకు దాదాపుగా 50 నుండి 60 శాతం నష్టం అంటూ టాక్ వినిపిస్తుంది.

rrr vs radhe shyam movie comparison about collections world records (1)
rrr vs radhe shyam movie comparison about collections world records (1)

ఈ సమయంలో జక్కన్న మూవీ ఎలా ఉంటుంది.. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏంటీ అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ కొందరు మాత్రం ఆ వాదన కొట్టి పారేస్తున్నారు. ఆ సినిమా కు జక్కన్న సినిమాకు అస్సలు పోలిక లేదని.. ఆ రెండు సినిమాలను పోల్చాల్సిన అవసరం లేదంటూ వారు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పూర్తి భిన్నమైన సినిమాలు. రాధేశ్యామ్ సినిమాకి దర్శకుడు రాధాకృష్ణ… కానీ ఆర్‌ఆర్ఆర్ సినిమాకి దర్శకుడు రాజమౌళి. ఈ ఒక్క మార్పు.. ఈ ఒక్క తేడా చాలు. రెండు సినిమాలు చాలా వైవిద్యభరితమైనవి, రెండు సినిమాలకు దూరం చాలా ఉన్నది అని చెప్పడానికి అంటూ ఉన్నారు.

Advertisement

Read Also : RRR Fans : అభిమానుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది… ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మధ్య బిగ్ ఫైట్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel