Big Boss Beauty Lahari : వారితో ఒక రోజు గడిపాను.. నా కోరిక తీరింది.. బిగ్‌బాస్ బ్యూటీ లహరి పోస్ట్..

Big Boss Beauty Lahari : బిగ్‌బాస్ 5‌తో ఒక్క సారిగా స్టార్ అయింది లహరి. తనకు మిగిలిపోయిన ఓ కలను నెరవేర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తాజాగా వెల్లడించింది. నాగార్జున, ఆయన కొడుకు నాగచైతన్యతో ఒక రోజు గడపాలని అనుకున్నది. దీని కోసం ఎప్పటి నుంచో ఆమె వెయిట్ చేస్తోంది. తాజాగా ఆమె కలను తీర్చారు అక్కినేని నాగార్జున, నాగచైతన్య. దీంతో ఆ ముద్దుగుమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది ఈ బ్యూటీ. కలలు నిజంగానే నిజమవుతాయని, జనవరి 7, 2022 రోజున నా కల నెరవేరిందని చెబుతూ పోస్ట్ చేసింది.

nagarjuna-lahari-who-spent-time-with-naga chaitanya
nagarjuna-lahari-who-spent-time-with-naga chaitanya

మీ లాంటి గొప్ప వారితో రోజంతా స్పెండ్ చేసేందుకు చాన్స్ ఇచ్చినందుకు నాగార్జున, నాగచైతన్యకు థాంక్స్ చెప్పింది. నాగార్జునకు సంబంధించిన ప్రైవేట్ జట్‌లో వారిద్దరితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నాగార్జున, నాగచైతన్య ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. ఇతరుల కలను నెరవేర్చడంతో వారు ముందుంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున, నాగచైతన్య ఇద్దరు కలిసి బంగార్రాజు మూవీలో యాక్ట్ చేశారు.

ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సొగ్గాడే చిన్ని నాయన మూవీకి ఇది సీక్వెల్. ఇక లవ్ స్టోరీ మూవీ హిట్ సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య.. ప్రస్తుతం అదే ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. మరి తండ్రీకొడుకుల కాంబినేషన్ లో వస్తున్న బంగార్రాజు మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. సమంతతో విడిపోయిన తర్వాత తన ఫోకస్ మొత్తం సినీ కెరీర్‌పైనే ఉంచాడు నాగచైతన్య. స్టోరీల ఎంపికలో నాగార్జున సాయం తీసుకుంటున్నాడట.

Advertisement

Read Also : Chammak Chandra : చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్? ఛాన్స్ దక్కుతుందా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel