Tollywood Top Stars : వయస్సు తగ్గ సినిమాలు చేయండయ్యా.. ఆ పెద్ద హీరోలను ఏకిపారేసిన నెటిజన్లు..!

Tollywood Top Stars : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుందో ఏమో కానీ, టాప్ హీరోలకు మాత్రం ఉండదనే చెప్పాలి. టాప్ హీరోలుగా ఎదిగినప్పటి నుంచి తమ ప్రతి ఏదో ఒక సినిమాలో కొత్త హీరోయిన్లతో మెరుస్తుంటారు. కొన్నిసార్లు వీరితో జతకట్టేందుకు హీరోయిన్ కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా లేత వయస్సు హీరోయిన్లతోనూ తెగ రొమాన్స్ చేసేస్తుంటారు. చేయడానికి హీరోలకు అది కమర్షియల్ ఫార్ములా కావొచ్చు కానీ, చూసే ప్రేక్షకులకు మాత్రం పెద్దగా నచ్చడం లేదనే టాక్.. సోషల్ మీడియాలో ఇదే అంశంపై తెగ కామెంట్లు వస్తున్నాయి.

Tollywood Top Stars : Netizens Trolling on Megastar Chiranjeevi And Nagarjuna Movies
Tollywood Top Stars : Netizens Trolling on Megastar Chiranjeevi And Nagarjuna Movies

ఇంతకీ ఎవరిపై ఇంతగా నెటిజన్లు తిట్టిపోస్తున్నారంటే.. మన స్టార్ హీరోలు.. అందులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున అంట.. చిరు, నాగ్ ఇకపై ఈ తరహా సినిమాలను చేయకుండా ఉంటేనే బెటర్ అని అంటున్నారు. వయస్సు తగ్గ సినిమాలు చేసుకోవచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వయస్సు తగిన పాత్రలను చేయడం లేదని మాట ఎక్కువగా వినిపిస్తోంది.

చిరంజీవి వయస్సు 67ఏళ్లు అయితే.. నాగార్జున వయస్సు 60 దాటేసింది.. ఈ విషయాన్నే గత బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోనే గుర్తు చేసుకున్నారు. అదే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తే.. అక్కడ పెద్ద హీరోలు తమ ఏజ్‌కి తగ్గ సినిమాలను చేసుకుంటున్నారు. సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అనేది సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు.

Advertisement

Tollywood Top Stars : కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ ఏందయ్యా..  

పెద్ద హీరోలు కుర్ర హీరోయిన్లతో చేసే సినిమాలు చాలా తక్కువగానే ఉండొచ్చు. అదే టాలీవుడ్‌లో చూస్తే.. వయస్సు దాటిన రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తోంది. లేత వయస్సు అమ్మాయిలతో పెద్ద హీరోలు కెమెస్ట్రీ పండించడం చూసేవాళ్లకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్టు చెబుతున్నారు.

Tollywood Top Stars _ Netizens Trolling on Megastar Chiranjeevi And Nagarjuna Movies (2)
Tollywood Top Stars

సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో కుర్ర హీరోయిన్లతో పెద్ద హీరోలను చూసి నెటిజన్లు.. వయస్సుకు తగ్గ సినిమాలు చేసుకోవచ్చా కదా.. చూడలేకపోతున్నాం బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హీరో ఇమేజ్ పక్కన పెట్టేసి ఏదైనా కొత్తగా సినిమాలు చేస్తే చూసేందుకు బాగుంటుందని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఇతర సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద హీరోలు పూర్తిగా ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు.

ఎంతసేపు ఈ రొటీన్ మూవీలతో కానిచ్చేయకుండా కొంచెం ఏదైనా కొత్తగా చేస్తే చూడటానికి చక్కగా ఉంటుందని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇకనుంచి అయినా మన పెద్ద హీరోలు తమ వయస్సు తగినా సినిమాలను చేస్తారో లేదో అదే పనిగా రొటిన్ గా చేస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తారో రాబోయే సినిమాల్లో చూడాలి.

Advertisement

Read Also : Naga Chaitanya Marriage : చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో నాగ చైతన్య పెళ్లంట..?!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel