Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Radhe Shyam Movie : రాధేశ్యామ్ చిత్రంపై.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్..!

Radhe Shyam Movie : రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే ప్రభాస్ జంటగా యు.వి.క్రియేషన్స్, టీ. సిరీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రపంచ ... Read more

By Ramesh Babu

Published on: March 11, 2022 5:29 PM

Updated on: March 12, 2022 1:03 PM

---Advertisement---

Radhe Shyam Movie : రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే ప్రభాస్ జంటగా యు.వి.క్రియేషన్స్, టీ. సిరీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

Radhe Shyam Movie Updates
Radhe Shyam Movie Updates

ఇకపోతే ఈ సినిమాపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూ వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.అసలు ప్రభాస్ వెండితెరపై ఇలా ఎలా కనిపిస్తాడు అని ఆశ్చర్యమేస్తుంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం అయితే నేను మాత్రమే కాదు ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్ నటన ఉంది అంటూ ఈయన ప్రభాస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ సినిమా పై తమన్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ బాహుబలి సినిమాకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని ప్రశంశలు అందించారు. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ సోర్స్ కోసం తమన్ పని చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

Read Also : Radhe Shyam Review : ‘రాధేశ్యామ్‌’ సినిమా రివ్యూ

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel