వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Hero Yash: ఆ హీరోలతో నన్ను పోల్చొద్దు.. బాలీవుడ్ హీరోల గురించి యశ్ షాకింగ్ కామెంట్స్!

Hero Yash: కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో యశ్ ... Read more

By Ramesh Babu

Published on: April 7, 2022 10:38 AM

Updated on: April 7, 2022 10:38 AM

---Advertisement---

Hero Yash: కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో యశ్ ముంబైలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి వారితో యశ్ ను పోల్చి అక్కడి యాంకర్ మాట్లాడటంతో వెంటనే యశ్ మాట్లాడుతూ ఆ లాంటి స్టార్ హీరోలతో నన్ను పోల్చకండి. వారు సినిమా ఇండస్ట్రీకి మూలాలు.వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇండస్ట్రీ లోకి వచ్చాను అంతే కానీ వారికి సమానం ఎప్పుడు కాదు అలాంటి వారితో నన్ను పోల్చొద్దు అంటూ యశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషలు కాదు. ఇదంతా ఇండియన్ ఇండస్ట్రీ, భాషతో సంబంధం లేకుండా సినిమాలు విడుదల కావాలి. భాష ఏదైనా సినిమాలో సత్తా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు ఇలా ఈ విధానాన్ని రాజమౌళి ప్రవేశపెట్టారు ఆ విధానాన్ని మేమందరం అనుసరిస్తున్నాము అంటూ
యశ్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel