Vikram Movie: విక్రమ్ మూవీ నటీ నటులు కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? కమల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్…!

Vikram Movie: విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎక్కువగా తమిళ సినిమాలలో నటించినప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకున్నాడు. కమల్ హాసన్ నటుడిగా తన నటనతో పాటు,పాటలు పాడుతూ తన గాత్రంతో కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులని అలరిస్తుంటాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ నటులు కూడా నటించారు. పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫహద్‌ ఫాజిల్‌ ఈ సినిమ ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులని అలరించనున్నాడు. అయితే విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల అయ్యింది. విశ్వరూపం 2 సినిమా తర్వాత 4 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా థియేటర్లలో ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించిన ప్రముఖుల రెమ్యూనరేషన్ విషయాల గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

విక్రమ్ సినిమా మొత్తం దాదాపు 120 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో నటించటానికి కమల్ హాసన్ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా కోసం విజయ్ సేతుపతికి 10 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌ కి 4 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ ముట్టచెప్పినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన అనిరుధ్ కి 4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందచేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సినిమా బడ్జెట్ లో ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కోసం మొత్తం 70 నుండి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంత రాబడుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel