Baladithya captain : కాప్టెన్ గా బాలాదిత్య, జైలుకి గలాటా గీతు..!

Baladithya captain : బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ చాలా బాగా సాగుతోంది. ఓ వైపు గొడవలు మరోవైపు రచ్చతో ట్రోల్స్ కు గురవుతున్నారు. వారి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడం మొదటి వారంలో కొంచెం కష్టమే అయినప్పటికీ.. అంతా కెమెరాల్లో పడడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. గొడవ చేసైనా సరే ప్రలకు తెలియలనుకుంటున్నారు. ఇక తొలి వారానికి సంబంధించిన నామినేషన్స్ కంప్లీట్ కాగా.. ఏడుగురు నామినేట్ అయ్యారు.

baladithya-captain-in-big-boss-6-and-galata-geethu-go-to-jail
baladithya-captain-in-big-boss-6-and-galata-geethu-go-to-jail

ఇక తొలి వారానికి సంబంధించిన నామినేషన్లు కంప్లీట్ కాగా హౌస్ లో అందరితో బాగుండి కాప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు బాలాదిత్య. బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి ఓ వైపు లైవ్ ఇస్తూ… రాత్రికి అదే ఫుటేజీని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే అన్ సీన్ ఎపిసోడ్ లో ఈ కెప్టెన్సీ టాస్క్ ముగియడమే కాదు.. జైలు పంచాయతీలు కూడా ముగిశాయి.

కెప్టెన్ పోటీ దారులుగా ఉన్న కంటెస్టెంట్స్ కి కెప్టెన్సీ బండి అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ కు ఫైమాని సంచాలక్ గా నియమించారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, చాందిని చౌదరి, ఆర్జే సూర్య, మెరీనా, గీతుస రోహిత్ లు కెప్టెన్ పోరులో నిలిచారు. ఆదిరెడ్డి, బాలాదిత్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరకి బాలాదిత్య బిగ్ బాస్ సీజన్ 6కి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు.

Advertisement

Read Also : Bigg boss Season 6 : బిగ్ బాస్ లో మొగుడు, పెళ్లాల గలీజ్ పంచాయతీ.. మధ్యలోకి వచ్చిన శ్రీసత్య!

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub Editor – Tufan9 Telugu

నేను వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2016లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలో అడుగుపెట్టాను. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటాను.

Read More

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel