Venu Swamy: ఇండస్ట్రీకి అల్లు అర్జున్ బంగారు బాతు… ఆయనకు తిరుగులేదు.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Updated on: April 5, 2022

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. ఈయన గతంలో సమంత నాగచైతన్య విషయంలో చేసిన వ్యాఖ్యలు నిజం కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.అప్పటి నుంచి ఈయన సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోహీరోయిన్ల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఉగాది పండుగ సందర్భంగా కొత్త ఏడాది ప్రారంభం కావడంతో ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖుల జాతకాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి వేణుస్వామి తెలియజేశారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ తో సినిమాలు చేయడం వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని తెలియజేశారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి బంగారు బాతు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఐదు సంవత్సరాల వరకు ఈయనకు ఇండస్ట్రీలో తిరుగులేదని ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంటాయని ఆయన తెలిపారు.

ఇక అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్, రానా, మహేష్ బాబు వంటి వారు కూడా ఇండస్ట్రీలో మంచిగా విజయాలను అందుకుంటారని వేణుస్వామి తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో రష్మిక, సమంత, పూజా హెగ్డే ఈ ముగ్గురు హీరోయిన్లకు 2024 వ సంవత్సరం వరకు ఇండస్ట్రీలో తిరుగులేదని వేణుస్వామి హీరో హీరోయిన్ల జాతకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel