వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Roja: నేను ఆ మాట చెప్పను… వీళ్లు ప్రోమోలో వేస్తారంటూ మెలికలు తిరిగి పోయిన రోజా!

Roja: జబర్దస్త్ జడ్జిగా రోజా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తన అద్భుతమైన పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ప్రతి వారం జబర్దస్త్ కమెడియన్ల కంటే ముందుగానే రోజా వారు చెప్పే డైలాగులు చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అయితే రోజా ఇలా చెప్పడంతో కమెడియన్స్ వారి పరిస్థితి కక్కలేక మింగలేక అనేలా వారి పరిస్థితి ఉంటుంది. కంటెస్టెంట్ల కంటే ముందే పంచ్‌లు వేయడం ... Read more

By Ramesh Babu

Published on: March 17, 2022 5:12 PM

Updated on: March 17, 2022 5:12 PM

---Advertisement---

Roja: జబర్దస్త్ జడ్జిగా రోజా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తన అద్భుతమైన పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ప్రతి వారం జబర్దస్త్ కమెడియన్ల కంటే ముందుగానే రోజా వారు చెప్పే డైలాగులు చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అయితే రోజా ఇలా చెప్పడంతో కమెడియన్స్ వారి పరిస్థితి కక్కలేక మింగలేక అనేలా వారి పరిస్థితి ఉంటుంది.

కంటెస్టెంట్ల కంటే ముందే పంచ్‌లు వేయడం మీద ఫుల్ ట్రోలింగ్ నడుస్తుంటుంది. అయినా వాటి గురించి పట్టించుకోకుండా రోజా తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ ఉంటారు.తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రోజా ఎప్పటిలాగే కంటెస్టెంట్ కంటే ముందుగా పంచ్ డైలాగులు వేశారు. అయితే వెంకీ మంకీ స్కిట్‌లోఒక డైలాగ్ చెప్పడానికి రోజా సిగ్గుపడుతూ నేను ఈ డైలాగ్ చెప్పను అంటూ మెలికలు తిరిగిపోయింది. ఇంతకీ ఆ స్కిట్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే..లేడీ గెటప్ హరిత వస్తుంది.. నువ్ ఏం పని చేస్తుంటావ్ అని అడుగుతుంది. వెంటనే వెంకీ మంకీ సమాధానం చెబుతూ కస్టమర్ కేర్ లో పనిచేస్తుంటా అని చెప్పాడు.

ఇలా సమాధానం చెప్పిన వెంకీ మంకీ అనంతరం హరితను నువ్వేం చేస్తుంటావ్ అని ప్రశ్నించాడు. నేను కస్టమర్లతో పని చేయిస్తుంటా అంటూ హరిత రోజా ఒకేసారి చెబుతారు. కానీ రోజా మధ్యలో ఆగిపోయి నేను చెప్పను..చెబితే ప్రోమోలో వేస్తారు అంటూ ఆ డైలాగ్ చెప్పకుండా ఆగిపోయారు. ఇలా మొదటి సారిగా రోజా కంటెస్టెంట్ ల కంటే ముందుగా పంచ్ వేయడానికి ఆలోచించారు. మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel