వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Astrology: కుంభ రాశిలోకి ప్రవేశించనున్న శని… శని ప్రభావంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Astrology : నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలోకి మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శని మకర రాశి నుంచి ఈనెల 29వ తేదీ కుంభ రాశిలోకి ప్రవేశించారు. ఈ విధంగా శని రాశి మారడం వల్ల శని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. అయితే శని ప్రభావం ఉన్న ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఆ రాశులు ఎవరు వారికి ఎలా ఉండబోతోంది అనే ... Read more

By Ramesh Babu

Published on: April 23, 2022 12:00 PM

Updated on: April 23, 2022 12:39 PM

Astrology

---Advertisement---

Astrology : నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలోకి మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శని మకర రాశి నుంచి ఈనెల 29వ తేదీ కుంభ రాశిలోకి ప్రవేశించారు. ఈ విధంగా శని రాశి మారడం వల్ల శని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. అయితే శని ప్రభావం ఉన్న ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఆ రాశులు ఎవరు వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం….

Astrology
Astrology

ఈనెల 29వ తేదీ శని మకరరాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా శని కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ క్రింది తెలిపిన మూడు రాశుల వారికి ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి.

మేష రాశి: మేష రాశి వారికి శనీశ్వరుడి చల్లని చూపులతో వారికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది.శని మీ ఆదాయ లాభాలకు సంబంధించిన గ్రహంలో ఉండటం వల్ల మీకు డబ్బుకు ఏ మాత్రం కొదువలేదు. జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని ఎదురు చూసే వారికి ఇదే అనువైన సమయం. ముఖ్యంగా ఈ రాశికి చెందినవారు వ్యాపారాలలో మంచి విజయాలను సాధిస్తారు.

వృషభ రాశి: వృషభ రాశి వారికి శని ప్రభావం మంచి ఫలితాలను అందిస్తుంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం,ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఈ మూడింటిలో ఏదో ఒక దానిని తప్పకుండా పొందుతారు. వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇవే అనువైన సమయం. ఇక వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

ధనస్సు: ధనస్సు రాశి వారిపై శని ప్రభావం పడనుంది. శనీశ్వరుడు ఈ రాశి వారికి అన్ని మంచి ఫలితాలను ఇవ్వనున్నారు.ఇప్పటి వరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి ఇకపై ఆ బాధ నుంచి విముక్తి కలగనుంది. శనీశ్వరుడు కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ 3 రాశుల వారికి అద్భుతమైన అదృష్టాన్ని ఇవ్వనున్నట్లు జ్యోతిషం చెబుతోంది.

Read Also :Astrology tips : మీ కూతురిది ఈ రాశియేనా.. అయితే మీరు కోటీశ్వరులవ్వచ్చు!

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel