Chanakya Niti: జీవితంలో ధనవంతుడు కావాలంటే ఈ లక్షణం మీలో ఉండాల్సిందే… చాణిక్య నీతి!

Updated on: May 6, 2022

Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తన నీతి గ్రంథంలో తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్న, జీవితంలో గొప్ప ధనవంతులు కావాలన్నా, సంఘంలో పేరుప్రఖ్యాతలు కీర్తిప్రతిష్టలు కలగాలన్న ఎలా వ్యవహరించాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి అని ఎన్నో విషయాల గురించి ఆచార్య చాణక్యుడు తన గ్రంథంలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఈ క్రమంలోని జీవితంలో ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయం గురించి ఆచార్య చాణిక్యుడు ఎంతో అద్భుతంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాము అంటే పూర్తిగా ఆ విషయం గురించి మనకు అవగాహన వచ్చే వరకు మన ఆలోచనలను ఇతరులతో పంచుకోవద్దు.ఇలా మనకి వచ్చిన ఆలోచనని అందరితో పంచుకోవడం వల్ల చాలా మంది ఆ ఆలోచనలను తొక్కే యడానికి ప్రయత్నిస్తారు. ఇలా మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా చాలామంది అడ్డుపడతారు.అందుకే ఒక విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అందుకు సంబంధించిన వ్యక్తులను కలిసి పని విజయవంతంగా పూర్తి అయ్యేవరకు ఇతరులకు చెప్పకూడదు.

ఇలా మన ఆలోచనలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోకుండా అందులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి. ఈ విధంగా మనం చేపట్టిన ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి అయ్యేవరకు మన పోటీదారులకు సమాచారం తెలియకుండా నిశ్శబ్దంగా మన పనులను మనం చేసుకోవాలి.ఎప్పుడైతే ఇలాంటి లక్షణం కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులు తమ పనులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి జీవితంలో ధనవంతులుగా ఉండిపోతారు. అంతే కాని మనకు వచ్చిన ఆలోచనలను అందరితో పంచుకోవడం వల్ల చాలామంది మనల్ని ఎదగనివ్వకుండా అణచి వేయడానికి ప్రయత్నిస్తారని చాణిక్యుడు వెల్లడించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel