వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే ఆ లక్ష్మీ నారాయణడి అనుగ్రహం మనపైనే?

Nirjala Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒక ఏకాదశి కృష్ణపక్షంలోను మరొక ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది. ఇకపోతే జేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి జూన్ 10వ తేదీ వచ్చింది. ఈ ఏకాదశి రోజున భక్తులు పెద్ద ఎత్తున కటిన ఉపవాసంతో లక్ష్మీనారాయణ వ్రతం ఆచరిస్తారు.ఇక ఈ ఏకాదశి రోజు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా వ్రతం ఆచరిస్తారు కనుక ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ... Read more

By Ramesh Babu

Published on: June 10, 2022 11:52 AM

Updated on: June 10, 2022 11:52 AM

---Advertisement---

Nirjala Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒక ఏకాదశి కృష్ణపక్షంలోను మరొక ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది. ఇకపోతే జేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి జూన్ 10వ తేదీ వచ్చింది. ఈ ఏకాదశి రోజున భక్తులు పెద్ద ఎత్తున కటిన ఉపవాసంతో లక్ష్మీనారాయణ వ్రతం ఆచరిస్తారు.ఇక ఈ ఏకాదశి రోజు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా వ్రతం ఆచరిస్తారు కనుక ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఇకపోతే ఈ రోజు చేసే వ్రతం నిర్జల ఏకాదశి వ్రతం అని పిలుస్తారు.

ఈ ఏకాదశి నారాయణుడికి అంకితం చేస్తారు అందుకే ఈ ఏకాదశి రోజు కటిన ఉపవాసంతో లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించడం వల్ల ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండే సకల సంపదలతో పాటు అష్టైశ్వర్యాలను కలిగిస్తారు. మన దుఃఖాలను బాధలను దూరం చేసే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎంతో పవిత్రంగా ఆచరించాలి. ఇకపోతే ఈ ఏడాది ఏకాదశి వ్రతం జూన్ 10వ తేదీ శుక్రవారం ఉదయం 7:25 గంటలకు ప్రారంభమయ్యే జూన్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఏకాదశి ఉంటుంది.

జేష్ట మాసం మండుటెండలు ఒక రోజు మొత్తం నీటిని కూడా సేవించకుండా లక్ష్మీనారాయణ ఏకాదశి వ్రతం ఆచరించాలంటే ఎంతో కష్టతరమైనది. అందుకే ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారిపై ఆ లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఇకపోతే నిర్జల ఏకాదశి వ్రతం ఆచరించిన తర్వాత దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి వేసవి కాలంలో వస్తుంది కనుక నీళ్ళు కలిగిన పండ్లను దానం చేయడం ఎంతో మంచిది. అదేవిధంగా గొడుగు, చెప్పులు, దుస్తులు మొదలైన వాటిని నేడు దానం చేయటం వల్ల ఆ శ్రీహరి అనుగ్రహం మనపై ఉంటుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel