Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope : మేష రాశి వారికి జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో మేష రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గు

By Vinod Kumar

Published on: June 10, 2022 6:00 AM

Updated on: June 10, 2022 7:18 AM

Horoscope june 2022 check your zodiac signs Aries

---Advertisement---

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో మేష రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ నెల మేష రాశి వారికి చాలా బాగుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం చాలా మంచిది. పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే రైతులకు, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు చాలా చక్కటి ఫలితాలు కనిపించబోతున్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా ఈ మాసంలో శుభవార్త వినబోతున్నారు.

Horoscope
Horoscope

కాకపోతే పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సంబంధం కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాకే ముందుకు సాగాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు, విద్యుత్తుకు సంబంధించిన పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. జాగ్రత్త తప్పనిసరి. నవ గ్రహాల పూజలు చేస్తూ.. వేంకటేశ్వర స్వామికి పూజ చేయడం చాలా మంచిది.

Advertisement

Read Also :

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.