Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Wallet Vastu: మీ వాలెట్ చినిగిపోయిందని పడేస్తున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Wallet Vastu: సాధారణంగా కొన్ని వస్తువులు వాస్తు పరంగా మనకు ఎంతో మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి.అందుకే ఈ విధమైనటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులను ఇంట్లో పెట్టు

By Ramesh Babu

Published on: June 14, 2022 1:23 PM

Updated on: June 14, 2022 1:23 PM

---Advertisement---

Wallet Vastu: సాధారణంగా కొన్ని వస్తువులు వాస్తు పరంగా మనకు ఎంతో మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి.అందుకే ఈ విధమైనటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం చేస్తుంటాము.అయితే అలాంటి అదృష్టం కలిగించే వస్తువులు పాడైపోతే వాటిని బయట పడేయాలంటే చాలామందికి మనసు ఒప్పుకోదు.ముఖ్యంగా కొందరికి వారి పర్సులో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఎంతో అదృష్టం కలిసివస్తుందని ఆ పర్స్ లో డబ్బులు పెట్టడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తుంటారు. అయితే ఆ ఫర్స్ పాడైపోతే ఆ ఫర్స్ పడేసేముందు ఎంతో బాధపడుతూ ఉంటారు.

pjimage 2022 06 14T132315.767ఈ విధంగా మనకు అదృష్టం కలిగించిన పర్స్ పడేసే ముందు ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల పాత పర్స్ లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కొత్త పరిధిలోకి వస్తుంది.పాత పర్సులో ఉన్నటువంటి అదృష్టం కొత్త పర్సులోకి రావాలంటే పాత పర్సులో ఒక రూపాయి బిళ్ళను ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టాలి.అదేవిధంగా పాత పర్సులో కొన్ని బియ్యపు గింజలను వేసి మరుసటి రోజు ఆ బియ్యపు గింజలను కొత్త పర్సులో వేసుకోవటం వల్ల పాత పర్స్ లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కొత్త పర్సులోకి వస్తుంది. తద్వారా యధావిధిగా మన దగ్గర డబ్బులు నిల్వ ఉంటాయి.

Advertisement

ఇకపోతే చాలామంది ఇలా పాత పర్స్ పడేయడానికి మనసు ఒప్పుకోకపోతే వాటిని వారి దగ్గరే ఉంచుకోవచ్చు. అయితే ఖాళీగా ఉండకుండా కొన్ని బియ్యపు గింజలు,లేదా రూపాయి నాణెం వేసి వాటిని భద్రపరచుకోవాలి. అప్పుడే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.లేదంటే చిరిగిపోయిన వాలెట్ అలాగే పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.