Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope: మిథున రాశి వారికి జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022b సంవత్సరం జూన్ నెలలో మిథున రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన

By Vinod Kumar

Published on: June 14, 2022 6:00 AM

Updated on: June 13, 2022 11:00 PM

---Advertisement---

Horoscope: 2022b సంవత్సరం జూన్ నెలలో మిథున రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేస్, వాహన, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ధనయోగం అధికంగా కనిపిస్తోంది. అప్పుల కోసం ప్రయత్నించే వారికి లోన్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో చుట్టరికం ఉన్న వారితోనే పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

horoscope june 2022 check your zodiac signs gemini

Advertisement

పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్తగా పెడ్తే… చాలా లాభాలను పొందుతారు. కాబట్టి పెట్టబడులు పెట్టే ముందు కాస్త ముందూ వెనకా ఆలోచించి నిర్ణయాలు తీస్కోవాలి. అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు, క్రియేటివ్ రంగానికి సంబంధించిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే సోదర సోదరీమణులతో కొన్ని గొడవలు.. వారి కోసం డబ్బు ఖర్చు చేయడం వంటివి జరగబోతున్నాయి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అలాగే వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి తప్పించుకోని హాయిగా ఉండాలంటే గణపతి, వేంకటేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.