Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope: వృషభ రాశి వారికి జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గ

By Vinod Kumar

Published on: June 11, 2022 6:00 AM

Updated on: June 10, 2022 11:21 PM

---Advertisement---

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ యొగం ఉంది. వాహనాలు, వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాదండోయ్ ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు, భూములు కూడా మీుకు దక్కుతాయి. అలాగే ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో విదేశీ ధన యోగం ఉంది. వ్యాపారులు, ఉద్యోగులకు అనేక మైన లాభాలు కల్గబోతున్నాయి.

Horoscope june 2022 check your zodiac signs taurus

Advertisement

కాకపోతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నెలలో కచ్చితంగా శుభవార్త వింటారు. వివాహాల కోసం ప్రయత్నించే వారికి కచ్చితంగా ఈ నెలలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అప్పులు ఇచ్చేటప్పపుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాదండోయ్.. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో… దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిత్యం లలితా సహస్ర నామాలతో పాటు విష్ణు సహస్ర నామాలు వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.