Road accident: ఇంటర్ ఫలితాల్లో జిల్లా టాపర్.. ఆఖరి పరీక్ష రాసిన నాడే అనంత లోకాలకు!

Updated on: June 30, 2022

Road accident: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ముగాలకు చెందిన రాజేశ్వరికి చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం. ఒకటో తరగతి నుంచి ఆమె చదువులో ఎప్పుడూ ముందే ఉండేది. జిల్లా కేంద్రంలోని గొనుపాడు కేజీబీవీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నెల క్రితం జరిగిన ఇంటర్ పరీక్షలన్నీ చాలా బాగా రాసింది. అనుకున్నట్లుగానే జిల్లా టాపర్ అయింది. కానీ సంతోషించేందుకు ఆమె ప్రస్తుతం ప్రాణాలతో లేదు. చివరి పరీక్ష రాసిన రోజే తండ్రితో పాటు ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

అయితే మంగళ వారం వెలువడిన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో రాజేశ్వరికి 867 మార్కులు వచ్చాయి. జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినుల్లో రాజేశ్వరి టాప్ గా నిలిచింది. అయితే అభినందించేందుకు రాజేశ్వరి ప్రాణాలతో లేకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండే ఆమె ప్రతిభ తలుచుకొని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel