Lava Cheapest 5G Phone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లావా (Lava) సరికొత్త ఎంట్రీ లెవల్ 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా బ్లేజ్ 5Gగా పిలిచే ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. గత నెలలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. హ్యాండ్‌సెట్ గ్లాస్ బ్యాక్‌తో వచ్చింది.
కంపెనీ సెప్టెంబర్ 2022లో లాంచ్ చేసిన లావా బ్లేజ్ ప్రోని పోలి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 4G కనెక్టివిటీని అందిస్తుంది. వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ గోల్డ్, గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్ లావా బ్లేజ్ ప్రో కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. రూ.10,499 ధర ట్యాగ్‌తో వస్తుంది. లావా బ్లేజ్ 5Gని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. హ్యాండ్‌సెట్ ధర రూ. 9,999లతో వస్తుంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. ఈ ఫోన్ లభ్యత గురించి కంపెనీ ఇంకా వివరాలను ప్రకటించలేదు.
Lava Cheapest 5G Phone : లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్స్ ఇవే :
Lava Blaze 5G 720×1600 HD+ రిజల్యూషన్‌తో 6.51అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డివైస్‌కు పవర్‌ను అందిస్తుంది. MediaTek డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ ప్రాసెసర్. హ్యాండ్‌సెట్ 4GB RAMని ప్యాక్ చేస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది. Lava Blaze 5G 7GB వరకు వర్చువల్ RAM సపోర్టుతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సెల్ఫీల కోసం యూజర్లలో ముందు భాగంలో 8MP కెమెరాను పొందవచ్చు.
ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. వెనుక కెమెరా సిస్టమ్ ట్రిపుల్ సెన్సార్లను కలిగి ఉంటుంది. EIS సపోర్టుతో 50MP AI కెమెరా ఉంది. హ్యాండ్‌సెట్ 2k వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యూటీ, HDR, నైట్, పోర్ట్రెయిట్, మాక్రో, AI, ప్రో, UHD, పనోరమా, స్లో మోషన్, ఫిల్టర్‌లు, GIF, టైమ్‌లాప్స్, QR స్కానర్ వంటి కెమెరా ఫీచర్‌లను అందిస్తుంది. లావా బ్లేజ్ 5G 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. గరిష్టంగా 50 గంటల టాక్‌టైమ్‌ను అందజేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కొలతలు 165.3×76.4×8.9mm, బరువు 207గ్రాములు ఉంటుంది.
Read Also : Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..!