...

Tech Tips : మీ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ ప్రాబ్లం ఉందా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !

Tech Tips : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ లను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. కానీ కొత్తగా అందుబాటులోకి వస్తున్న కొత్త ఫీచర్లు కారణంగా ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతుంది. కొత్త ప్రాసెసర్, ప్రకాశవంతమైన స్క్రీన్ డిస్ప్లే, వేగవంతమైన ఇంటర్నెట్ ఫోన్ బ్యాటరీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఫోన్ బ్యాటరీ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని పరిష్కరించవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ పవర్ ని సేవ్ చేసే కొన్ని చిట్కాల గురించి మీకోసం…

వై-ఫై యాక్సెస్ (Wi-Fi) Access :
వైఫై కనెక్షన్‌ని ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచే అలవాటు మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే అవసరం లేనప్పుడు మీ వైఫై కనెక్షన్‌ని డిస్‌కనెక్ట్ చేయడం వల్ల మీ డేటాను సేవ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే వైఫైని ఉపయోగించండి.

బ్యాటరీ (Battery) ఎక్కువ వినియోగించే యాప్‌లను ఆపండి :
అనేక జనాదరణ పొందిన యాప్‌లు భారీ గ్రాఫిక్‌లతో వస్తాయి. ఇవి ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తాయి. ఈ పరిస్థితిలో ఫోన్ నుంచి ఈ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి బదులుగా వాటిని బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసివేయండి.

important-tips-to-increase-smart-phone-battery

పవర్‌ సేవ్‌ మోడ్ (Power Save Mode) :

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. కానీ చాలామంది దీనని వినియోగించరు. ఇది మీ ఫోన్ బ్యాటరీ డ్రెయిన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఆన్ చేయండి. బ్యాటరీ సేవ్‌ మోడ్ మీ బ్యాటరీని అయిపోగొట్టే అన్ని ప్రోగ్రామ్‌లను మూసివేస్తుంది. మీ బ్యాటరీ అయిపోతున్నప్పుడు, ఛార్జింగ్ ఎంపిక అందుబాటులో లేనప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి (Notifiation Off) :

ఫేస్ బుక్, ట్విట్టర్ లేదా న్యూస్‌ వెబ్‌సైట్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌ల వల్ల ఎక్కువ బ్యాటరీ అయిపోతుంది. మీ బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించడానికి మీరు అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో దీన్ని సులభంగా చేయవచ్చు. యాప్ చిహ్నాన్ని పుష్ చేసి పట్టుకోవడం ద్వారా ‘యాప్ సమాచారం’ కనిపిస్తుంది. దీని కింద మీరు నోటిఫికేషన్ ఎంపిక ఉంటుంది. దీన్ని మీరు ఆన్, ఆఫ్ చేసుకునే సౌలభం ఉంటుంది.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!